
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు .”ఆర్ఎక్స్100″ సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో ఆ తరువాత వరుస సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.రీసెంట్ గా ఈ యంగ్ హీరో “బెదురులంక” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..అయితే ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన కూడా కమర్షియల్ గా అంతగా ఆకట్టుకోలేదు.తాజాగా ఈ యంగ్ హీరో నటిస్తున్నమూవీ ‘భజే వాయు వేగం’.యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది.
అలాగే ఈ సినిమాలో “హ్యాపీడేస్” ఫేమ్ రాహుల్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు.ఇప్పటికే భజే వాయు వేగం సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. తాజాగా భజే వాయు వేగం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు..నువ్ లవర్..నేను ఫ్లవర్..తగ్గేదేలే..అంటూ సాగే ఈ మాసివ్ లవ్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది .సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాటని రాయగా రధన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.