
ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోతున్నారు.. అప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా బాలయ్య సరసన సూపర్ హిట్ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఆమె ఎవరో? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం..
ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పేరు గుర్తుండే ఉంటుంది కదా.. ఆ సినిమాతో నటిగా మంచి మార్కులు పడ్డాయి.. వరుస సినిమాల్లో నటించింది. ఉల్లాసంగా ఉత్సాహంగా, కరెంట్, సింహా వంటి చిత్రాల్లో నటించిన స్నేహా ఉల్లాల్‌కు టాలీవుడ్లో మంచి గుర్తింపు వచ్చింది. అయితే స్నేహా ఉల్లాల్‌కు స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు.. ఒక్క హిట్ కూడా పడలేదు.. అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది.. కానీ పెద్దగా ఫేమస్ అవ్వలేక పోయింది..
ఈ అమ్మడును అస్సలు పట్టించుకోలేదు.. తెలుగులో ఒక్క అవకాశం కూడా రాలేదని తెలుస్తుంది.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.. స్నేహా ఉల్లాల్ బిగ్ బాస్ బ్యూటీ, బోల్డ్ హీరోయిన్ తేజస్వీతో కలిసి కనిపించింది. చూస్తుంటే ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉన్నట్టుగా కనిపిస్తోంది.. ఇప్పుడు భవనం సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతుంది.. ఆ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ ను ఇస్తుందో చూడాలి..