Leading News Portal in Telugu

Viral video: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రైలుపై సాహసం.. గాల్లో కలిసిన ప్రాణాలు


Viral video: ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం రైలుపై సాహసం.. గాల్లో కలిసిన ప్రాణాలు

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. యువత హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఫేమస్ కావడం కోసమో.. వ్యూస్ కోసమో.. లేనిపోని సాహసాలు చేసి కన్నతల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. తాజాగా ఓ యువకుడి చేసిన స్టంట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. వీడికి ప్రాణం విలువ తెలియదంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అసలు ఇంతకీ ఏం జరిగింది. యువకుడు చేసిన రీల్ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.


ఇది కూడా చదవండి: CM YS Jagan: ఇలాంటి వారా వైఎస్సార్‌ వారసులు..?

ఇన్‌స్టాగ్రామ్ రీల్ కోసం ఓ యువకుడు రన్నింగ్‌లో ఉన్న రైలు పైకి ఎక్కి నానా హంగామా చేశాడు. రకరకాలైన బిల్డప్‌లు ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఇంకా పైకి ఎక్కే ప్రయత్నం చేశాడు. అంతే హైటెన్షన్ వైర్ తగిలి పెద్ద మంటతో మాడిమసయ్యాడు. ట్రైన్ మీదే ప్రాణాలు విడిచాడు. యువకుడి చేసిన విన్యాసాలను.. మరొకరు మొబైల్‌లో షూట్ చేశాడు. దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా… నెట్టింట వైరల్‌గా మారింది. గుజరాత్‌లోని నవయార్డ్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇది కూడా చదవండి: Kejriwal: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ విడుదల.. ఆప్ శ్రేణులు ఘన స్వాగతం

యువకుడు రైలు పైకప్పుపైకి రాగానే.. కెమెరాకు పోజులిచ్చి విజయ చిహ్నాన్ని చూపించాడు. క్షణాల తర్వాత ఓవర్ హెడ్ ఎలక్ట్రిక్ కేబుల్‌ను తాకగానే విద్యుదాఘాతానికి గురై మృత్యువాత పడ్డాడు. వీడియోను ఎక్స్‌ ట్విటర్‌లో పోస్టు చేయగా.. 9.7 మిలియన్లకు పైగా వీక్షించారు. అయితే ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రాణం విలువ తెలియదని మండిపడ్డారు. ఇంకొందరు రకరకాలైన కామెంట్లు చేశారు.