Leading News Portal in Telugu

Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్‌ రోడ్ షో.. బహిరంగ సభపై సస్పెన్స్‌..


Pawan Kalyan: కాకినాడలో పవన్ కల్యాణ్‌ రోడ్ షో.. బహిరంగ సభపై సస్పెన్స్‌..

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది.. సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగియనుంది.. ఇక, చివరి రోజు కాకినాడలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ రోడ్‌షో నిర్వహించనున్నారు.. అయితే, ఆ తర్వాత పవన్‌ కల్యాణ్ బహిరంగ సభపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది.. బహిరంగ సభకు ఇంకా అనుమతులు ఇవ్వలేదు రిటర్నింగ్ ఆఫీసర్, పోలీసులు.. అయితే, ఇప్పటికే కాకినాడలో ర్యాలీకి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పర్మిషన్ తీసుకుంది.. ఇదే సమయంలో జనసేన బహిరంగ సభ ఉండడంతో.. రెండు పార్టీలకి అనుమతి ఇస్తే లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని పోలీసులు చర్చించుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. మరోవైపు.. పర్మిషన్ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పవన్ కల్యాణ్‌ సభ జరిగి తీరుతుంది అంటున్నారు జనసేన-టీడీపీ-బీజేపీ నేతలు.. కాకినాడ సిటీ నియోజకవర్గంలో ఎక్కడ సభకు అనుమతి ఇచ్చిన ఇబ్బంది లేదని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు కూటమి నేతలు.. కాగా, చివరి రోజు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టారు నేతలు.. ఈ రోజు సీఎం వైఎస్ జగన్.. పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని ముగించనుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ప్రచారానికి పులిస్టాప్ పెట్టనున్నారు. ఇక, చివరి రోజు రాహుల్ గాంధీ, జేపీ నడ్డా లాంటి కీలక నేతలు కూడా ఈ రోజు ఏపీలో ప్రచారం నిర్వహించనున్న విషయం విదితమే.