Leading News Portal in Telugu

T.Raja Singh: మోడీ అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలు కనాలనే కండీషన్ పక్కా పెడతారు..


T.Raja Singh: మోడీ అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలు కనాలనే కండీషన్ పక్కా పెడతారు..

T.Raja Singh: మోడీ అధికారంలోకి వస్తే ఇద్దరు పిల్లలు కనాలనే కండీషన్ పెడతారని రాజాసింగ్ హాట్ కామెంట్ చేశారు. మోడీ అధికారంలోకి వస్తే… అందరికీ ఒకటే విధానం తీసుకురాబోతున్నరని తెలిపారు. మనకు ఇద్దరు పిల్లలనే కనాలి, వాళ్లు కూడా ఇద్దరు పిల్లలనే కనాలనే నిబంధన పెట్టి తీరుతారని అన్నారు. కరీంనగర్ బైక్ ర్యాలీలో పాల్గొన్న రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయన్నను బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిందే అన్నారు.


కేసీఆర్ లాంటోడు తురకోళ్ల ముందు నిలబడి ఏమంటడు.. బండి సంజయ్ గలీజీడోట అంటూ మండిపడ్డారు. లిక్కర్ దందా చేసిన నీ బిడ్డను జైలుకు పంపినందుకు బండి సంజయ్ గలీజోడైండా? అని ప్రశ్నించారు. కేటీఆర్… నువ్వొక నాస్తిడివి.. నీకు శ్రీరాం గురించి ఏం తెలుసు? నీకు ముస్లిం ఓట్లే కావాలా?… హిందువుల ఓట్లు వద్దా? అని మండిపడ్డారు. గతంలో మీ అయ్య హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే.. సంజయన్న ఏం చేసిండో మీకు తెలుసా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది భారత దేశ ఎన్నికలివి. దేశ ప్రధానిని ఎవరిని చేయాలో జరిగే ఎన్నికలివి. రాహుల్ పప్పును ప్రధానిని చేయగలమా? అన్నారు.

Read also: Chhattisgarh : విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకున్న పేరెంట్స్.. కూతురిపై కోర్టు కీలకవ్యాఖ్యలు

పాకిస్తాన్ లోని ఓ మంత్రి అంటాడు… భారత్ లో ఎవరు గెలిచినా ఫరవాలేదు. రాహుల్ గెలిచినా ఓకే.. కానీ మోడీ గెలవకూడదట. ఆయన ప్రధాని కాకూడదట… తీవ్రవాదుల అడ్డా పాకిస్తాన్ అంటూ సంలన వ్యాఖ్యలు చేశారు. 1950 నుండి ఇప్పటిదాకా ముస్లిం జనాభా 43 శాతం పెరిగింది.. హిందువుల జనాభా 8 శాతం తగ్గిందన్నారు. భారత్ ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి కాంగ్రెస్ కూటమి పార్టీలు కుట్ర చేస్తున్నయ్ అన్నారు.

ఈసారి మోడీ అధికారంలోకి వస్తే… అందరికీ ఒకటే విధానం తీసుకురాబోతున్నరు. మనకు ఇద్దరు పిల్లలనే కనాలి. వాళ్లు కూడా ఇద్దరు పిల్లలనే కనాలనే నిబంధన పెట్టి తీరుతారన్నారు. మా బామ్మర్థులు ఒవైసీలు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నరు. వాళ్లు మానసిక రోగంతో బాధపడుతున్నరు. వాళ్లను మెంటల్ ఆసుపత్రిలో చేర్చాలి. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామంటున్నారని తెలిపారు. దేశంలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా… బీజేపీ అధికారంలోకి రాంగనే ఒవైసీ బామ్మర్థులను యాడికి పంపిస్తమో మీరే చూస్తరన్నారు.
KTR: ఆడ పిల్లలకు స్కుటీలు రాలేదు కానీ.. కాంగ్రెస్ నాయకులు లూటీ స్టార్ట్ అయింది..