Leading News Portal in Telugu

Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!


Pawan kalyan: కాలికి గాయం.. నడవలేకపోతున్న పవన్ కళ్యాణ్!!

Pawan Kalyan Faces Difficulty While Walking with Toe Injury: రణరంగాన్ని తలపించిన ఏపీ ఎన్నికల ప్రచారం మరికొద్ది నిమిషాల్లో ముగియనుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియగా సరిగ్గా 6 గంటలకు ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం ముగియబోతుంది. సరిగ్గా చివరి రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వెళ్లారు. ఈ ఉదయం హైదరాబాదు నుంచి బయలుదేరి రాజమండ్రి ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన ఆయన తల్లి సురేఖతో కలిసి పిఠాపురంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ప్రాంతానికి వెళ్లారు. ఇక ఈ క్రమంలో రామ్ చరణ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు జనసేన కార్యకర్తలు గుమిగూడారు.


Ramakrishna Nandamuri: రండి కదలి రండి, సమయం ఆసన్నమైంది.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్ కుమారుడు

అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వీడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో ఆయన కుడి కాలి బొటన వేలుకి కట్టుతో కనిపిస్తున్నారు. ఆ కారణంగా ఆయన నడిచేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇదే విషయం రామ్ చరణ్, సురేఖతో కలిసి దిగిన ఫోటోలు ద్వారా కూడా క్లారిటీ వస్తోంది.ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ కుడివేరి బొటన వేలుకి ఒక కట్టు కనిపిస్తోంది. దీంతో అసలు పవన్ కళ్యాణ్ కాలికి ఏమైంది? అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఈ కాలికి కట్టు సుమారు రెండు మూడు రోజుల నుంచి కనిపిస్తోంది. ఆయన కాలి వేలికి ఏం జరిగిందనే విషయం మీద మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.