Leading News Portal in Telugu

TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..


TSRTC: ఇక టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు బంద్.. ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు..

TSRTC Sajjanar: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, జీన్స్‌ ధరించి విధులకు హాజరుకావద్దని ఆదేశాలు జారీ చేశారు. కొందరు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఆర్టీసీ ఉద్యోగులు టీషర్టులు, డెనిమ్ ప్యాంట్‌లతో విధులకు వస్తున్నప్పటికీ.. ఈ తరహా దుస్తులు సంస్థను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ఆర్టీసీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆర్టీసీ అధికారులు, సిబ్బంది అందరూ యూనిఫాం లేదా అధికారిక దుస్తుల్లోనే విధులు నిర్వహించాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ ప్రతిపాదించారు.


ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త అందించింది. ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల అనంతరం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అంతేకాదు ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఓటర్లు పెద్దఎత్తున ఏపీకి వెళ్తున్నారు. తెలంగాణ – ఏపీ మధ్య తిరిగేందుకు 450 ఆర్టీసీ బస్సుల బుకింగ్ పూర్తయినట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల రద్దీ కారణంగా, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 2,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. హైదరాబాద్‌లోని వివిధ రద్దీ ప్రాంతాల నుండి మొత్తం 2,000 బస్సులు నడుస్తాయి. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 200 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు.