Leading News Portal in Telugu

Mahesh Babu: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన మహేశ్‌ బాబు, రామ్‌చరణ్


Mahesh Babu: జూబ్లీహిల్స్ పోలింగ్ కేంద్రాల్లో ఓటేసిన మహేశ్‌ బాబు, రామ్‌చరణ్

Mahesh Babu: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 17 ఎంపీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగుతోంది. కాగా, సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత రామ్ చరణ్, మహేశ్ బాబు కూడా ఓటు వేశారు. సూపర్ స్టార్‌ మహేశ్ బాబు, నమ్రత దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో మహేశ్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఓటేశారు. మహేశ్‌ బాబును చూసేందుకు చాలా మంది పోటీ పడ్డారు. మేం ఓటు వేశాం… మీరు కూడా ఓటేయండి అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.


గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి జూబ్లీ క్లబ్‌లో పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. చరణ్ రాకతో పోలింగ్ కేంద్రం వద్ద సందడి నెలకొంది. అందరూ బయటకు ఓటు హక్కు వినియోగించుకోవాలని.. యువకులు అధికంగా ఓటు వేయాలని రామ్‌ చరణ్ పిలుపునిచ్చారు. అనంతరం అక్కడ్నించి రామ్ చరణ్, ఉపాసన వెళ్లిపోయారు.