
హీరో తేజ సజ్జ తన నెక్స్ట్ సినిమాను కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈయన ఇటీవల రవితేజతో కలిసి ఈగల్ సినిమాను తీశాడు. ఇక ప్రస్తుతం వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమాకు ‘మిరాయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా సినిమా నుండి మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది.
Read Also: Kalki 2898 AD: బుజ్జి బుజ్జి బుజ్జి.. అసలు ఎవర్రా ఈ బుజ్జి..?
ఈ సినిమా క్షుద్ర పూజల నేపథ్యంలో తెరకెక్కుతుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ” ప్రొడక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మంచు మనోజ్ లాంటి హీరోలు కూడా కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్ ఓ యోధుడి పాత్రలో నటించనుండగా.. మంత్రగాడు పాత్రలో మంచు మనోజ్ నటిస్తున్నాడని సమాచారం.
ఇక తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో మంచు మనోజ్ పాత్రను రివిల్ చేస్తున్నట్లు ప్రకటించింది మూవీ మేకర్స్. ఈ మేరకు మంత్రగాడి పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇక సినిమాలోని మంచు మనోజ్ ఫుల్ పోస్టర్ ను మే 20న ఉదయం 10:30 గంటల నుంచి ఏఏఏ సినిమాస్లో గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమాలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తుంది.
Brace yourselves to witness our very own Rocking star @HeroManoj1 as A MIGHTY FORCE from the world of #MIRAI
Unveiling #TheBlackSword in a Grand Launch Event on May 20th at AAA Cinemas from 10:30 AM onwards
#SuperYodha
Superhero @tejasajja123 @Karthik_gatta… pic.twitter.com/2nIkh607pD
— People Media Factory (@peoplemediafcy) May 18, 2024