
మోటో కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త కొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి. తాజాగా మరో కొత్త మొబైల్ మార్కెట్ లోకి విడుదల అయ్యింది. సూపర్ ఫీచర్స్ పాటు స్టైలిష్ లుక్ లో మోటారోలా ఏడ్జ్ 50 ఫ్యూజన్ భారత మార్కెట్ లోకి వచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఈ కొత్త మొబైల్ ఫీచర్స్, ధర గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
మొబైల్ 144 Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 6.70-అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. 2400×1080 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో పని చేస్తుంది. ఈ కొత్త మొబైల్ 8GB, 12GB RAMతో వస్తుంది. అంతేకాదు ఈ కొత్త మొబైల్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mAhగా అందిస్తున్నారు. ఈ మోటో ఫోన్ 68W టర్బో ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మాత్రం సపోర్ట్ చేస్తుంది.. ఇక కెమెరా విషయానికొస్తే.. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 13-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉన్న డ్యూయల్ కెమెరా సెటప్‌ను ప్యాక్ చేసి ఉంటుంది. సెల్ఫీలకు ఇది బెస్ట్ అనే చెప్పాలి..
సెల్ఫీల కోసం చూసేవారి 32 మెగా ఫిక్సెల్ తో అందుబాటులోకి రానుంది.. అలాగే ఈ కొత్త ఫోన్ డ్యూయల్ సిమ్ ను కలిగి ఉంటుంది. బరువు 174.90 గ్రాములతో ఈ ఫోన్ రెడీ అయింది. ఫారెస్ట్ బ్లూ, హాట్ పింక్ మరియు మార్ష్‌మల్లౌ బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.. ఈ ఫోన్ ధర రూ.22,999 గా ఉంటుంది. ర్యామ్ సైజ్ పెరిగే కొద్ది ఫోన్ కాస్ట్ కూడా పెరుగుతుంది..