Leading News Portal in Telugu

Naga Chaitanya: తండేల్ కోసం తొమ్మిది నెలలు.. సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ


Naga Chaitanya: తండేల్ కోసం తొమ్మిది నెలలు.. సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ

Naga Chaitanya about Thandel: నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్‌తో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమధ్యనే హీరో నాగ చైతన్య సినిమాలో ఒక ఫోటోని ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలో నాగ చైతన్య పల్లెటూరి గెటప్‌లో కనిపిస్తున్నారు. చొక్కా , నల్ల ప్యాంటు ధరించి, మెడలో రెడ్ టవల్ తో మ్యాసీ హెయిర్, గుబురు గడ్డం, చేతిలో తాడుతో పడవలో నిలబడి, ఆకట్టుకునే చిరునవ్వుతో మెరుస్తూ కనిపించారు నాగచైతన్య. తండేల్ లో మత్స్యకారుడి పాత్ర కోసం నాగచైతన్య ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకొని కంప్లీట్ గా మేకోవర్ అయ్యారు. తన యాస పై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ సినిమాలో శ్రీకాకుళం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు నాగచైతన్య.


CM Jagan Stone Incident Case: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి బెయిల్.. కానీ..

అయితే ఈ విషయం మీద తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఈ OTT రోజుల్లో ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించాలంటే లార్జర్ థాన్ లైఫ్ సబ్జెక్ట్స్ ఉండాలని అన్నారు. అలా చేయడం ఒక ఆర్గానిక్ ప్రక్రియ అయి ఉండాలి, దీనిలో కంటెంట్ ప్రాజెక్ట్ యొక్క పరిధిని నిర్దేశిస్తుంది మరియు ముఖ్యంగా, మీరు పాత్రకు అనుగుణంగా ఉండాలని అన్నారు. తండేల్ సినిమా కోసం నేను దాదాపు తొమ్మిది నెలలు సిద్ధమయ్యాన. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకున్నాను.. ఇది నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫిల్మ్, నాకు ఈ పాత్ర అవసరం అని ఆయన అన్నారు. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, షామ్‌దత్ డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీనాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్.