
Naga Vamsi Grand Mother Passed Away: తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. సుప్రసిద్ధ సినీ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) మాతృమూర్తి సూర్యదేవర నాగేంద్రమ్మ (90) గురువారం (30-5-24) మధ్యాహం 3 గంటల ప్రాంతంలో హృదయ సంబంధిత వ్యాధితో కన్నుమూశారు. ఆవిడకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. రాధాకృష్ణ గారు ఆవిడకు రెండవ తనయుడు. నిర్మాత సూర్యదేవర నాగ వంశీకి నాగేంద్రమ్మ నాయనమ్మ అవుతారు.
Rajisha Vijayan: పెళ్ళికి రెడీ అయిన మరో హీరోయిన్.. అబ్బాయి ఎవరంటే?
రేపు ఉదయం 10 గంటల ప్రాంతంలో ఫిల్మ్ నగర్ లోని విద్యుత్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. చినబాబు తెలుగులో హారికా హాసిని సంస్థను మొదలుపెట్టి అనేక హిట్ సినిమాలు నిర్మించారు. అయితే ఆయన వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నాగ వంశీ కూడా ఇప్పుడు అనేక హిట్ సినిమాలను నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాతగా విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా రేపు విడుదల అవుతోంది. ఆ సినిమా రిలీజ్ కి ఒకరోజు ముందు నాగ వంశీ నానమ్మ మరణించడం గమనార్హం.