Leading News Portal in Telugu

Kamakshi Bhaskarla : స్టోరీ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలో కూడా నటిస్తాను..


Kamakshi Bhaskarla : స్టోరీ డిమాండ్ చేస్తే అలాంటి పాత్రలో  కూడా నటిస్తాను..

Kamakshi Bhaskarla : టాలీవుడ్ నటి కామాక్షి భాస్కర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.తన అద్భుతమైన నటనతో ఈ భామ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ఈ భామ నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ పొలిమేర సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.చేతబడి వంటి థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.గత ఏడాది ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన పొలిమేర 2 సినిమా రిలీజ్ అయింది.ఈ సినిమా కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.


ఈ సినిమాలో కామాక్షి నటన అద్భుతమని చెప్పాలి.ఈ సినిమాలో కామాక్షి నటనకు గాను అవార్డు కూడా లభించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈ భామ షాకింగ్ కామెంట్స్ చేసింది.నటనకు ప్రాధాన్యత వున్నఏ పాత్ర అయిన చేయడానికి తాను సిద్ధం అని కామాక్షి తెలిపింది.కథ డిమాండ్ చేస్తే తాను న్యూడ్ గా అయిన నటిస్తాను అని కామాక్షి తెలిపింది.అలాగే తనకి డాన్స్ కూడా వచ్చని..స్టార్ హీరోల సరసన స్పెషల్ సాంగ్స్ చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని కామాక్షి తెలిపింది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా వుండే ఈ భామ తన హాట్ పిక్స్ తో రెచ్చగొడుతుంది.