Leading News Portal in Telugu

Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..


Music Shop Murthy : ఎమోషనల్ డ్రామాగా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’… ఆకట్టుకుంటున్న ట్రైలర్..

Music Shop Murthy : టాలీవుడ్ విలక్షణ నటుడు అజయ్ ఘోష్ ,క్యూట్ హీరోయిన్ చాందిని చౌదరి ప్రధాన పాత్రలలో నటించిన లేటెస్ట్ మూవీ “మ్యూజిక్ షాప్ మూర్తి “..శివ పాలడుగు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఫ్లై హై సినిమాస్ బ్యానర్ పై హర్ష గారపాటి,రంగారావు గారపాటి గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి పవన్ సంగీతం అందించారు. ప్రేక్షకులను ఎంతగానో అలరించే కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతుంది.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయినా పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది.ఈ సినిమాను మేకర్స్ “జూన్ 14 ” న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.


ఓ మిడిల్ క్లాస్ వ్యక్తి తన కలను నెరవేర్చుకోవడానికి వయసుతో సంబంధం లేదు అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఈ సినిమా ట్రైలర్ నవ్విస్తూనే ,ఎమోషనల్ గా సాగుతుంది.ఎమోషనల్ డైలాగ్స్ తో నటుడు అజయ్ ఘోష్ ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఎమోషనల్ డ్రామాగా వస్తున్నఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు వున్నాయి.ఈ చిత్రాన్ని డీజె టిల్లు,బేబీ వంటి చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.ఈ సినిమా అద్భుత విజయం సాదిస్తుందని మేకర్స్ ఎంతో ధీమాగా వున్నారు.