Leading News Portal in Telugu

Ramoji Rao: రామోజీరావు మృతి.. టాలీవుడ్ కీలక నిర్ణయం


Ramoji Rao: రామోజీరావు మృతి.. టాలీవుడ్ కీలక నిర్ణయం

Tollywood Shootings Stalled Due to Ramoji Rao Death: అనారోగ్య కారణాలతో కన్నుమూసిన ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మృతి నేపథ్యంలో తెలుగు సినీ పరిశ్రమ కీలక నిర్ణయం తీసుకుంది. నిజానికి రామోజీరావు నిర్మాతగా తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ నిర్మాణం చేసి తెలుగు సినిమాలకు మాత్రమే కాదు భారతదేశంలో ఉన్న దాదాపు అన్ని సినిమాల షూటింగ్స్ కి హైదరాబాద్ ను కేంద్ర బిందువు అయ్యేలా చేశారు.


Rajamouli: రామోజీరావు పార్థివదేహం వద్ద రాజమౌళి కంటతడి.. భారత రత్న ఇవ్వాలంటూ!

బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ సైతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్నాయి అంటే అది కేవలం రామోజీరావు వల్లే అని తెలుగు సినీ ప్రేమికుల గంటా పథంగా చెబుతున్నారు. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో ఆయనకు సంతాపంగా రేపు తెలుగు సినీ పరిశ్రమంలో తెలుగు సినిమాలకు సంబంధించిన అన్ని షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇక రామోజీరావు మృతి నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు హీరోలు దర్శక నిర్మాతలు తమ సంతాపాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామోజీ ఫిలిం సిటీలో చివరి చూపు కోసం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించేందుకు పెద్ద ఎత్తున వెళుతున్నారు.