Leading News Portal in Telugu

Pranaya Godari: రా అండ్ రస్టిక్ గా ప్రణయ గోదారి ఫస్ట్ లుక్


Pranaya Godari: రా అండ్ రస్టిక్ గా ప్రణయ గోదారి ఫస్ట్ లుక్

Komatireddy Venkat Reddy Launched Eye-pleasing First Look Of Pranayagodari: ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ గా ప్రణయగోదారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తునే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్‌ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదగా ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.


Anjaamai: నటుడు విధార్థ్, వాణి భోజన్‌లను అరెస్ట్ చేయాలి.. కలకలం రేపుతున్న సినిమా వివాదం

తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి కలిగించే కథతో వస్తోందని అర్థమవుతోంది. టైటిల్‌కి తగ్గట్టుగా రా అండ్ రస్టిక్ గా అనిపిస్తోంది. ఇక ఈ లుక్ చూస్తుంటే నాచురల్ లొకేషన్స్ లో సీన్స్ చిత్రీకరించారని తెలుస్తోంది. పోస్టర్ లో గోదారి అందాలు, అక్కడి ప్రజల జీవన విధానాలు ప్రస్ఫుటం అవుతున్నాయి. నది ఒడ్డున హీరో హీరోయిన్ సైకిల్ పై ప్రయాణం చేస్తూ కనిపిస్తుండగా వెనుక మరో వ్యక్తి కనిపిస్తున్నారు. ఇక మార్కండేయ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈదర ప్రసాద్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. కొరియోగ్రఫర్స్ గా కళాధర్ , మోహనకృష్ణ , రజిని వ్యవహరిస్తూ ఉండగా ఎడిటర్ గా కొడగంటి వీక్షిత వేణు వ్యవహరిస్తున్నారు. ఇక అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు.