Leading News Portal in Telugu

Airtel Bumper Offer: రూ.9కే 10జీబీ డేటా.. కానీ కండిషన్స్ అప్లై..


  • భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ ను మార్కెట్ లోకి విడుదల.
  • కేవలం రూ . 9 కే 10 జీబీ డేటా.
  • కేవలం ఒక గంట మాత్రమే వ్యాలిడిటీ.
Airtel Bumper Offer: రూ.9కే 10జీబీ డేటా.. కానీ కండిషన్స్ అప్లై..

Airtel Bumper Offer: తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ (Airtel) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఇక ఈ కొత్త ప్లాన్ ధర 9 రూపాయలు మాత్రమే. ఇది కేవలం డేటా వోచర్ మాత్రమే. దీనికి ఎలాంటి సర్వీస్‌ వ్యాలిడిటీ కూడా ఉండదు. అయితే మనకు మొత్తం 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ఇక్కడే ఓ పెద్ద సమస్య ఉంది. ఇది కేవలం ఒక గంటలో మాత్రమే ఉపయోగించుకోవాలి. ఇకపోతే ఈ రూ.9 ప్లాన్ అందరికీ సరిపోకపోవచ్చు. ఎవరైనా పెద్ద డేటా ఫైల్‌ లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు లేదా తక్కువ వ్యవధిలో మీకు వేగవంతమైన డేటా అవసరమైనప్పుడు దీనిని ఉపయోగించవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఇతర సర్వీస్ ప్రొవైడర్ల నుండి 10 జీబీ డేటా కావాలనుకుంటే కనీసం రూ. 100 కంటే ఎక్కువ డబ్బులని చెల్లించాలి. ఈ ప్లాన్‌ ను మొబైల్ యాప్ లేదా భారతీ ఎయిర్‌టెల్ వెబ్‌సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.


Dead Rat In Sambar: సాంబార్‌లో చనిపోయిన ఎలుక.. పాపులర్ రెస్టారెంట్‌లో ఘటన..వీడియో వైరల్..

ఇకపోతే, ఎయిర్టెల్ ఇటీవల భారతదేశంలో రూ. 395 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ యొక్క చెల్లుబాటును పెంచింది. ప్యాక్ ఇంతకుముందు 56 రోజుల చెల్లుబాటును అందించింది. కానీ ఇప్పుడు 70 రోజులకు పెరిగింది. అయితే, ప్యాక్ యొక్క ఇతర ప్రయోజనాలు మారవు. ఈ ప్లాన్ లో ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్‌లను, 6 జీబీ డేటాను, 600 SMS లను పొందుతాము. ఇక ఇదే ప్లాన్ మాదిరి జియో కూడా ఇదే విధమైన ప్లాన్‌ను అందిస్తుంది. దీనికి 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. ఇది ఎయిర్‌టెల్ ప్యాక్ కంటే రెండు వారాలు ఎక్కువ చెల్లుబాటు ఉంటుంది.

Delhi: ఢిల్లీలో పలుచోట్ల వర్షం.. వేడి నుంచి ఉపశమనం