Leading News Portal in Telugu

Stock Market: మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ


  • మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్.. నిఫ్టీ

  • 79000 కీలక మైలురాయి దాటిన సెన్సెక్స్

  • 24 వేల కీలక మైలురాయి దాటిన నిఫ్టీ
Stock Market: మళ్లీ రికార్డుల మోత మోగించిన సెన్సెక్స్, నిఫ్టీ

కేంద్రంలో మోడీ 3.0 సర్కార్ కొలువుదీరాక స్టాక్ మార్కెట్లలో సరికొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సూచీలు టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. ఈ వారం అయితే మరింత దూకుడుగా ట్రేడ్ అయ్యాయి. గత నాలుగు రోజులుగా భారీ ర్యాలీ దిశగా దూసుకుపోయాయి. ఏ రోజుకు ఆ రోజు తాజా రికార్డులు నమోదు చేశాయి. ఇక గురువారం అయితే సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త మైలురాయిని తాకాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలు.. కొద్ది సేపట్లోనే వేగంగా పుంజుకుని సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. సెన్సెక్స్ 79000 కీలక మైలురాయి దాటగా.. నిఫ్టీ కూడా 24 వేల మైలురాయిని అధిగమించింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 568 పాయింట్లు లాభపడి 79, 243 దగ్గర ముగియగా.. నిఫ్టీ 175 పాయింట్లు లాభపడి 24,044 దగ్గర ముగిసింది.


ఇది కూడా చదవండి: Mosquito Repellent Plants: ఇంట్లో ఈ మొక్కలు పెంచుకుంటే దోమల నివారణ తగ్గించవచ్చు..!

అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎల్‌టిఐఎండ్‌ట్రీ, విప్రో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లు ఎన్‌ఫిటీ లాభాల్లో కొనసాగగా.. శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్‌అండ్ టి, కోల్ ఇండియా, బజాజ్ ఆటో మరియు ఒఎన్‌జిసి నష్టపోయాయి.

ఇది కూడా చదవండి: Bullet Trains: భారతదేశం అంతటా “బుల్లెట్ ట్రైన్స్”.. త్వరలో కేంద్రం అధ్యయనం..