Leading News Portal in Telugu

Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్‌ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..


  • విశాలమైన ఇల్లు కొనుక్కొవాలనే ఆశలు ఉన్న ప్రజలకు ఈస్ట్‌ క్రెస్ట్‌ సువర్ణావకాశం
  • లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్‌ క్రెస్ట్
Pranava East Crest: లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈస్ట్‌ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే..

Pranava East Crest: హైదరాబాద్‌ మహానగరం వేగంగా విస్తరిస్తోంది. నగరం నలుమూలలా రియల్ ఎస్టేట్ వేగంగా వృద్ధి చెందుతోంది. భూముల ధరలు, ఇళ్ల నిర్మాణ ఖర్చు భారీ జరుగుతోంది. ప్రజలు సైతం విశాలమైన లేఔట్లలో అధునాత సౌకర్యాలతో నివాస గృహం ఉండాలని కోరుంటుకున్నారు. అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తమ ఇల్లు ఉండాలని కోరుకుంటారు. సకల సౌకర్యాలు కల్పిస్తూ లగ్జరీ ఇళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్‌ క్రెస్ట్. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత డెవలపర్‌లలో ఒకరైన ప్రణవ గ్రూప్‌ తీసుకొచ్చిన అందమైన ప్రాజెక్టు ఈ ఈస్ట్ క్రెస్ట్. ఇది హైదరాబాద్‌-నాగార్జున సాగర్‌లో రోడ్డులో ఉన్న హస్తినాపురంలోని సౌత్ జోన్‌లో ఉంది. లగ్జరీ సౌకర్యాలతో ఇల్లు కావాలంటే ఈ ఈస్ట్‌ క్రెస్ట్‌ను సందర్శించాల్సిందే.


పచ్చని ప్రకృతిని ఆస్వాదించేలా..
విశాలమైన ఇల్లు కొనుక్కొవాలనే ఆశలు ఉన్న ప్రజలకు ఈస్ట్‌ క్రెస్ట్‌ ఓ సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. 1225 అడుగుల చదరపు విస్తీర్ణంలో 2 బీహెచ్‌కే, 1355 అడుగుల చదరపు విస్తీర్ణంలో 2.5 బీహెచ్‌కే,1570 నుంచి 1840 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 బీహెచ్‌కే ఇళ్లను ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్‌ క్రెస్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. ప్రతి ఇంటికి గ్లా్‌స్ రెయిలింగ్‌తో కూడిన అందమైన బాల్కనీలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 90 యూనిట్లు ఉన్నాయి. చక్కని పార్కింగ్ సౌకర్యాలతో పచ్చని ప్రకృతిని ఆస్వాదించేలా వాతావరణాన్ని కల్పించారు. ఈ ప్రాజెక్టులో అన్ని సౌకర్యాలను కల్పించారు. పిల్లలు ఆడుకోవడానికి క్రికెట్ పిచ్, యాంపీథియేటర్, ఇండోర్ ఆట స్థలం, టేబుల్ టెన్నిస్, పార్టీ లాన్, పిల్లల కోసం ప్లే ఏరియా, సీటింగ్ ఏరియా, కాఫీ షాప్, ఔట్‌ డోర్ జిమ్‌, బాస్కెట్‌ బాల్ కోర్టు, స్కేటింగ్ రింక్, బ్యాడ్‌మింటన్‌ కోర్టు, యోగా స్టూడియో, స్విమ్మింగ్ పూల్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు ఈ ప్రాజెక్టులో కల్పించారు. ఈ ప్రాజెక్టును అద్భుతంగా నిర్మించారు. ఈ ప్రాజెక్టులో టెలికాం, ఇంటర్నెట్, కేబుల్‌ సర్వీసులను ఇంట్లోని ప్రతిగదికి అందేలా డిజైన్ చేశారు.

అందుబాటులో అన్ని సౌకర్యాలు
ఈ ఈస్ట్‌ క్రెస్ట్‌ ప్రాజెక్టుకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. స్కూల్స్‌, మాల్స్, ఆస్పత్రులు, వినోద సౌకర్యాలు, రెస్టారెంట్లు, ప్రజారవాణా అందుబాటులో ఉన్నాయి. మెట్రో లైన్‌ కూడా దగ్గర్లోనే ఉంది. ఎల్బీ నగర్‌ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటే 10 నిమిషాల వ్యవధిలో వెళ్లిపోవచ్చు. నాగోల్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాలంటే 20 నిమిషాల్లో వెళ్లిపోవచ్చు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు కూడా దగ్గర్లోనే ఈ ప్రాజెక్టు ఉంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లాలంటే కేవలం 30 నిమిషాల్లోనే వెళ్లిపోవచ్చు. అన్ని రకాల సౌకర్యాలతో ప్రశాంత వాతావరణంలో మీకు సొంత ఇల్లు కావాలనుకుంటున్నారా.. సంప్రదించండి ప్రణవ గ్రూప్‌కు చెందిన ఈస్ట్‌ క్రెస్ట్ ప్రాజెక్ట్.