- మూడు కొత్త ప్లాన్లను ప్రవేశపెట్టిన జియో
-
ఈ ప్లాన్ల ధర రూ.51.. రూ. 101.. రూ.151 -
ఈ ప్లాన్లలో 4G ఇంటర్నెట్.
ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించిన రిలయన్స్ జియో… కొత్తగా డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. ఈ కేటగిరీకి చెందిన మొబైల్ యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు. వీటి ధర రూ.51 నుంచి ప్రారంభమవుతుంది. రూ. 101, రూ. 151 ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్లు ఉత్తమమైనవి. మూడు ప్లాన్లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే, ఇవన్నీ అపరిమిత 5G డేటాతో వస్తాయి. అంతే కాకుండా.. మూడు ప్లాన్లకు చెల్లుబాటు లేదు. ఈ ప్లాన్ల చెల్లుబాటు యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటుపై ఆధారపడి ఉంటుంది.
రూ.51తో రీఛార్జి చేసుకుంటే 3జీబీ 4జీ మొబైల్ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ డేటాను ఆనందించొచ్చు. రూ.101 ప్లాన్‌పై 6జీబీ, రూ.151 ప్లాన్‌పై 9జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్ వ్యాలిడిటీనే వీటికి వర్తిస్తుంది. రిలయన్స్ జియో టారిఫ్ పెంపుతో పాటు.. 5G డేటాను ఉపయోగించే నియమాలను కూడా మార్చింది. మునుపటిలాగా ఇప్పుడు అందరికీ అపరిమిత డేటా లభించదు. బదులుగా, ప్రధాన ప్లాన్ 2GB లేదా అంతకంటే ఎక్కువ డేటాను అందించే వినియోగదారులు మాత్రమే దాని ప్రయోజనాన్ని పొందగలరు.