Leading News Portal in Telugu

Singapore : లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు


Singapore : లాగిన్ కోసం ఓటీపీని డిజిటల్ టోకెన్ తో భర్తీ చేయనున్న సింగపూర్ బ్యాంకులు

Singapore : సింగపూర్‌లోని ప్రధాన రిటైల్ బ్యాంకులు డిజిటల్ ఖాతాదారులచే బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం వన్-టైమ్ పాస్‌వర్డ్‌ల (OTPలు) వినియోగాన్ని క్రమంగా తొలగిస్తాయని ప్రకటించాయి. రాబోయే మూడు నెలల్లో టోకెన్ వినియోగదారులు వీటికి మారాలని సింగపూర్‌లోని మానిటరీ అథారిటీ (MAS), సింగపూర్‌లోని బ్యాంకుల సంఘం (ABS) మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. సైబర్ మోసాల వల్ల 2023లో దాదాపు 14.2మిలియన్ సింగపూర్ డాలర్లను పోగొట్టుకున్నారని బ్యాంకుల సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. కొత్తగా తీసుకుని వచ్చే విధానం ఐదు స్కామ్ ల నుండి ఇది వారిని మెరుగ్గా కాపాడుతుందని తెలిపింది.

ఇందుకోసం తొలత వినియోగదారులు తమ మొబైల్ లో తమ డిజిటల్ టోకెన్‌ని యాక్టివేట్ చేసుకోవాలి. అలా చేసిన కస్టమర్‌లు బ్రౌజర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా బ్యాంక్ ఖాతా లాగిన్ కోసం తమ డిజిటల్ టోకెన్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. స్కామర్‌లు దొంగిలించగల OTP అవసరం లేకుండానే కస్టమర్‌ల లాగిన్‌ను డిజిటల్ టోకెన్ ప్రమాణీకరిస్తుంది. సైబర్ నేరాలకు పాల్పడితే కస్టమర్‌లను అలర్ట్ చేస్తుందని సింగపూర్‌లోని మానిటరీ అథారిటీ తెలిపింది. ఇందుకోసం వీలైనంత త్వరగా కస్టమర్లు తమ డిజిటల్ టోకెన్‌లను యాక్టివేట్ చేయాలని MAS, ABS కోరుతున్నాయి.

ఆన్‌లైన్ భద్రతను పటిష్టం చేయడానికి 2000లో OTPని వినియోగంలోకి తెచ్చారు. అయినప్పటికీ, సాంకేతిక పరిణామాలు, అధునాతన సామాజిక ఇంజనీరింగ్ వ్యూహాలు స్కామర్‌లను కస్టమర్ల OTPలను దొంగిలించే వీలు కల్పించాయి. ఫిషింగ్ స్కామ్‌లు సింగపూర్‌లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న స్కామ్ ల్యాండ్‌స్కేప్‌లో వాటిని ఎదుర్కొనేందుకు బ్యాంకులు MAS , సింగపూర్ పోలీస్ ఫోర్స్‌తో కలిసి పని చేస్తూనే ఉన్నాయి.