Leading News Portal in Telugu

Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!


  • అమెజాన్‌లో బంపర్ ఆఫర్
  • రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు
  • నో కాస్ట్ ఈఎంఐ కూడా
Realme Narzo 70 Offer: రియల్‌మీ నార్జో 70పై భారీ తగ్గింపు.. బంపర్ ఆఫర్ ఈ ఒక్క రోజే!

Realme Narzo 70 5G Offers in Amazon: తక్కువ ధరలో మంచి 5జీ స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఈ ఏడాదే మార్కెట్‌లోకి లాంచ్ అయిన ‘రియల్‌మీ నార్జో 70’పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై బంపర్ ఆఫర్ ఉంది. అయితే ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంది. ‘రియల్‌మీ నార్జో 70 కొనాలనుకునేవారు ఈ ఆఫర్ అస్సలు మిస్సవ్వొద్దు. ఆఫర్ పూర్తి డీటెయిల్స్ ఓసారి చూద్దాం.

అమెజాన్‌లో రియల్‌మీ నార్జో 70 స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యామ్‌+128GB స్టోరేజ్‌ ధర రూ.15,999గా ఉంది. 20 శాతం తగ్గింపు అనంతరం ఈ ధర ఉంది. అమెజాన్‌లో ఈ వేరియెంట్‌పై రూ.2000 డిస్కౌంట్ కూపన్ అందుబాటులో ఉంది. మీరు రూ.13,999కే కొనుగోలు చేయొచ్చు. 8జీబీ+128జీబీ వేరియెంట్‌పై కూడా అదే ఆఫర్ ఉంది. రూ.16,999 స్మార్ట్‌ఫోన్‌ను రూ.14,999 కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్ గ్గురువారం అర్ధరాత్రి వరకూ మాత్రమే ఉంది. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది.

రియల్‌మీ నార్జో 70 ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత రియల్‌మీ యూఐ 5.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 1,200 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 120Hz రీఫ్రెష్‌ రేటుతో 6.67 ఇంచెస్ డిస్‌ప్లేను ఇచ్చారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 7,050 ప్రాసెసర్‌ ఇందులో ఉంటుంది. వెనకాల 50ఎంపీ ప్రైమరీ సెన్సర్‌, f/1.8 అపెర్చర్‌, 2ఎంపీ సెన్సర్‌తో కూడిన కెమెరా సెటప్‌ను ఇచ్చారు. సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరా ఉంది. 45వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఇచ్చారు.