Leading News Portal in Telugu

Gold Rates Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?


  • షాక్ ఇచ్చిన బంగారం ధరలు
  • వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి
  • నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే
Gold Rates Today: మళ్లీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే?

Gold Rates Today in India on 11 July 2024: బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. వరుసగా రెండు రోజలు తగ్గిన పసిడి ధరలు.. నేడు భారీగా పెరిగాయి. గురువారం (జులై 11) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.200 పెరిగి.. రూ.67,300కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ. 220 పెరిగి.. రూ.73,420గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,450 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,570గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.67,300 కాగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా నమోదైంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.67,850గా.. 24 క్యారెట్ల ధర రూ.74,020గా ఉంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళ, హైదరాబాద్​, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ధర రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.73,420గా నమోదైంది.

ఈరోజు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.95,500గా ఉంది. నేడు ఢిల్లీలో కిలో వెండి ధర రూ.95,500 కాగా.. ముంబైలో రూ.95,500గా ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.1,00,000లుగా నమోదవగా.. బెంగళూరులో అత్యల్పంగా రూ.94,750గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర రూ.1,00,000లుగా నమోదైంది.