Leading News Portal in Telugu

Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!


  • కొనుగోలుదారులకు భారీ షాక్
  • నేడు రూ.330 పెరిగింది
  • హైదరాబాద్‌లో రూ.67600
Today Gold Price: వరుసగా రెండోరోజు.. భారీ షాక్ ఇచ్చిన బంగారం ధరలు!

Today Gold Price in India on 12 July 2024: కొనుగోలుదారులకు బంగారం ధరలు భారీ షాక్ ఇస్తున్నాయి. పసిడి ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ రెండు రోజులుగా పెరుగుతూ పోతున్నాయి. నిన్న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.220 పెరగ్గా.. నేడు రూ.330 పెరిగింది. దీంతో ఈ రెండు రోజుల్లో రూ.550 పెరిగింది. శుక్రవారం (జులై 12) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,600గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (999 గోల్డ్) ధర రూ.73,750గా ఉంది. మరోవైపు వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.95,500గా నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.67,600
విజయవాడ – రూ.67,600
బెంగళూరు – రూ.67,600
ముంబై – రూ.67,600
కోల్‌కతా – రూ.67,600
ఢిల్లీ – రూ.67,750
చెన్నై – రూ.68,250

24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.73,750
విజయవాడ – రూ.73,750
బెంగళూరు – రూ.73,750
ముంబై – రూ.73,750
కోల్‌కతా – రూ.73,750
ఢిల్లీ – రూ.73,900
చెన్నై – రూ.74,460

కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.1,00,000
విజయవాడ – రూ.1,00,000
ముంబై – రూ.95,500
చెన్నై – రూ.1,00,000
కోల్‎కతా – రూ.95,500
ఢిల్లీ – రూ. 95,500
బెంగళూరు – రూ.95,000