Leading News Portal in Telugu

Maar Muntha Chod Chinta: మాస్ పూరీ ఈజ్ బ్యాక్.. మార్ ముంత చోడ్ చింత అంతే!


Maar Muntha Chod Chinta: మాస్ పూరీ ఈజ్ బ్యాక్.. మార్ ముంత చోడ్ చింత అంతే!

Maar Muntha Chod Chinta Song Released: ఉస్తాద్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సెన్సేషనల్ హిట్ ఇస్మార్ట్ శంకర్ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే మ్యూజికల్ హిట్ అయ్యింది. అదేవిధంగా, ఈ డెడ్లీ కాంబినేషన్‌లో రెండవ సినిమా డబుల్ ఇస్మార్ట్ ఆల్బమ్ కూడా విడుదలకు ముందే చార్ట్‌బస్టర్‌గా మారుతుంది. ఇస్మార్ట్ శంకర్‌కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఆయన ఈ సినిమా కోసం మరో మాస్-ఆపీలింగ్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు. మొదటి సింగిల్ స్టెప్పా మార్కుకి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు, సినిమా యొక్క రెండవ సింగిల్ మార్ ముంత చోడ్ చింతా విడుదలైంది. కాసర్ల శ్యామ్ రాసిన విలక్షణమైన సాహిత్యం అంతా హైదరాబాద్ యాసలో ఇంట్రెస్టింగ్ అనిపిస్తోంది.

Manorathangal: 9 మంది స్టార్లు.. 9 కథలు.. కమల్ టు మోహన్ లాల్.. డోంట్ మిస్!

ఈ దేశీ పార్టీ నంబర్‌కి మణి శర్మ మార్క్ మ్యూజిక్ లోకల్ ఫోక్ వైబ్ తో కనిపిస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజన్ సీపాన, మరియు కీర్తన శర్మ త్రయం ఈ పాటకు గాత్రాన్ని అందించగా వారి స్వరాలు పాటలోని శక్తికి సరిగ్గా సరిపోలాయి. ఇక పాటలో రామ్ ఎనర్జీ తదుపరి స్థాయిలో ఉండగా అతని డాన్స్ తో సాంగ్ కన్నుల పండువగా ఉంది. రామ్‌తో పాటు కాలు కదిలించిన కావ్య థాపర్ ఈ పాట కోసం గ్లామ్ క్వీన్ గా మారిపోయింది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో పూరి జగన్నాధ్ మరియు ఛార్మీ కౌర్ నిర్మించిన ఈ సినిమాలో సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించగా, రామ్ సరసన కావ్య థాపర్ హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 15న పాన్ ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రానికి సామ్ కె నాయుడు మరియు జియాని గియానెలీ సినిమాటోగ్రఫీని చూసారు. ఈ సినిమాలో రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్, అలీ, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు.