Leading News Portal in Telugu

Amazon Prime Day Sale 2024: అమెజాన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు.. కాంబో డీల్స్‌ కూడా!


  • అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌ 2024
  • ప్రైమ్‌ మెంబర్స్‌కు మాత్రమే
  • అమెజాన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులపై డిస్కౌంట్లు
Amazon Prime Day Sale 2024: అమెజాన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు.. కాంబో డీల్స్‌ కూడా!

Discounts Amazon Products in Amazon Prime Day Sale 2024: భారతదేశంలో ‘అమెజాన్‌ ప్రైమ్‌ డే సేల్‌’ 2024 సమీపిస్తోంది. ఈ సేల్‌ జులై 20, 21 తేదీల్లో జరగనుంది. ఈ సేల్‌ కేవలం ప్రైమ్‌ మెంబర్స్‌కు మాత్రమే అన్న విషయం తెలిసిందే. ఈ రెండు రోజుల్లో అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో లభించనున్నాయి. స్మార్ట్‌ఫోన్స్, ఇయర్‌ఫోన్స్, ట్యాబ్‌ల నుంచి.. వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ ఐటెమ్‌ల వరకు అన్ని వస్తువులపై భారీగా రాయితీ ఉండనుంది. అంతేకాదు బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు కూడా ఉంటాయి. ముఖ్యంగా అమెజాన్‌ బ్రాండ్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ఉండనున్నాయి.

ఈ సేల్‌లో తమ బ్రాండ్‌తో వస్తోన్న స్మార్ట్‌ హోమ్‌ పరికరాలపై భారీ ఎత్తున రాయితీ ఇస్తున్నట్లు అమెజాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఫైర్‌ స్టిక్‌, అలెక్సాతో కూడిన ఎకో స్మార్ట్‌ స్పీకర్లు.. అలెక్సా అనుసంధానిత స్మార్ట్‌ హోమ్‌ పరికరాలపై 55 శాతం వరకు రాయితీ ఇస్తోంది. రూ.3,999 ధర ఉన్న అమెజాన్‌ ఎకో పాప్‌ను రూ.2,499కే కొనుగోలు చేయొచ్చు. రూ.8,999గా ఉన్న ఎకో షో 5 (2 జెన్‌)ను రూ.3,999కే లభిస్తోంది. రూ.13,999గా ఉన్న ఎకో షో 8 (2 జెన్‌) రూ.8,999కు అందుబాటులో ఉంటుంది.

అమెజాన్‌ కాంబో డీల్స్‌ను కూడా ప్రకటించింది. విప్రో 9W స్మార్ట్‌ బల్బ్‌తో కలిపి ఎకో డాట్‌ (5 జెన్‌) రూ.4,749కే అందుబాటులో ఉంటుంది. క్లాక్‌తో కూడిన ఎకో డాట్‌ (4 జెన్‌), విప్రో 9W స్మార్ట్‌ బల్బ్‌ రూ.3,749కు కొనుగోలు చేయొచ్చు. విప్రో 9W స్మార్ట్‌ బల్బ్‌తో కలిపి ఎకో పాప్‌ రూ.2,749కి లభిస్తోంది. అమెజాన్‌ స్మార్ట్‌ ప్లగ్‌తో కలిపి విప్రో బల్బ్‌ రూ.2,948కే లభించనుంది. ఇక 56 శాతం డిస్కౌంట్‌ అనంతరం అమెజాన్ ఫైర్‌ టీవీ స్టిక్‌ రూ.2,199కు లభించనుంది. ఫైర్‌ టీవీ స్టిక్‌ 4కేపై 43 శాతం, ఇన్‌బిల్ట్‌ ఫైర్‌ టీవీతో కూడిన స్మార్ట్‌ టెలివిజన్‌పై 50 శాతం రాయితీ ఉంది.