Leading News Portal in Telugu

R. Narayana Murthy: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్ నారాయణ మూర్తి


  • ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు

  • నేను ఆరోగ్యంగానే ఉన్నా
  • అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్.నారాయణమూర్తి

  • నేను నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాను: ఆర్.నారాయణమూర్తి

  • దేవుడి దయవల్ల బాగానే కోలుకుంటున్నాను: ఆర్ నారాయణ మూర్తి

  • నేను కోల్కున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను: ఆర్ నారాయణ మూర్తి
R. Narayana Murthy: నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: ఆర్ నారాయణ మూర్తి

R. Narayana Murthy Responds on Illness News: పీపుల్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఆర్.నారాయణమూర్తి అనారోగ్యం పాలైనట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనకు ఏమైందో తెలియక ఆయన అభిమానులైతే ఆందోళన పడుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ప్రస్తుతానికి తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన వెల్లడించారు. నా ఆరోగ్యం గురించి అభిమానులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నేను నిమ్స్ హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నాను, దేవుడి దయ వల్ల బాగానే కోరుకుంటున్నాను.

ఆ మజా వేరు.. ప్రెజర్ వుంది.. హనుమాన్ కన్నా ముందే డార్లింగ్ : హీరో ప్రియదర్శి ఇంటర్వ్యూ

నేను కోలుకున్నాక నా ఆరోగ్యం గురించి అన్ని వివరాలు చెబుతాను అంటూ ఆయన వెల్లడించారు. ఆర్.నారాయణమూర్తి డాక్టర్ బీరప్ప ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే నిజానికి ఆయన ఈ ఉదయం కూడా ప్రసాద్ ల్యాబ్ లో కనిపించారు. మధ్యాహ్నానికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయనని నిమ్స్ హాస్పిటల్ కి తరలించడం హాస్పిటల్ లో చేర్చడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఈ విషయాన్ని ఆయన సన్నిహితులు కొంతమంది సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఆర్.నారాయణమూర్తికి అనారోగ్యం అని వార్త తెరమీదకి వచ్చింది.