Leading News Portal in Telugu

Aay: బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో, కమెడియన్


Aay: బెట్టింగ్ రైడ్ లో అడ్డంగా దొరికిపోయిన తెలుగు హీరో, కమెడియన్

Raj Kumar KasiReddy and Ankith Koyya Betting Mafia : సినిమా ప్రమోషన్లు విభిన్నంగా చేయాలని సినిమా యూనిట్లో తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మధ్య యాంకర్ రోహిణి రేవు పార్టీలో అరెస్టు అయిందంటూ ఒక వీడియో విడుదల చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు. ఇప్పుడు అదే విధంగా తెలుగులో పలు సినిమాల్లో హీరోగా నటించిన అంకిత్ కొయ్య, పలు సినిమాలలో కమెడియన్ గా నటించిన రాజ్ కుమార్ కసిరెడ్డి బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయినట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు.

Nani: దటీజ్ నాని.. నానితో నానికే పోటీ.. అదిదా మ్యాటర్!

అసలు విషయం ఏమిటంటే ఈ ఇద్దరు ఆయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నందమూరి తారక రామారావు బావమరిది నార్నె నితిన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది. ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేశారు. ఆ వీడియోలోనే రాజ్ కుమార్ కసిరెడ్డి అంకిత్ కొయ్య బెట్టింగ్ కేసులో అరెస్ట్ అయినట్టు పోలీసులు వారిని తీసుకువెళ్లబోతుండగా వారు మీడియాతో మాట్లాడుతున్నట్టుగా వీడియో రిలీజ్ చేశారు. తాము ఎంత చెప్పినా ఈ సినిమా నిర్మాత బన్నీ వాస్ వినడం లేదని, సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టడం లేదని అందుకే అరెస్ట్ చేసినట్లు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన వస్తాడని ఇలా చేశామంటూ చెప్పుకొచ్చారు. మొత్తం మీద ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.