Leading News Portal in Telugu

Director Suicide: ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ పెండింగ్ లో ఉండగా దర్శకుడు సూసైడ్


Director Suicide: ఇండస్ట్రీలో విషాదం.. షూటింగ్ పెండింగ్ లో ఉండగా దర్శకుడు సూసైడ్

Kannada Tv Serial Director Vinod Dondale Dies By Suicide: కన్నడ బుల్లితెర, సినీ రంగాలు ఒకదాని తర్వాత ఒకటి షాక్‌లను ఎదుర్కొంటున్నాయి. పలువురు నటులు, నటీమణుల మరణాలు, వివాదాలు, విడాకులతో కొట్టుమిట్టాడుతున్న కన్నడ ఎంటర్ టైన్ మెంట్ ఇండస్ట్రీకి ఒక సీరౌల్ దర్శకుడి ఆత్మహత్య మరో షాక్ ఇచ్చింది. కలర్స్ కన్నడ ఛానెల్‌లో ప్రసారమవుతున్న ‘కరిమణి’ సీరియల్ దర్శకుడు వినోద్ ధోండాలే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నాగరబావిలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. వినోద్ ధోండాలే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బెంగళూరు నగరంలోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసుల విచారణ తర్వాత ఆత్మహత్యకు గల కారణాలు తెలియనున్నాయి. వినోద్ ధోండాలే దర్శకత్వంలో సతీష్ నీనాసం కథానాయకుడిగా నటిస్తున్న అశోక్ బ్లేడ్ సినిమా షూటింగ్ ఇంకా పెండింగ్‌లో ఉంది.

Anna Konidela: సింగపూర్ లో రెండో మాస్టర్స్.. పట్టా పొందిన పవన్ భార్య

చివరి దశ షూటింగ్ పెండింగ్ లో ఉండగానే దర్శకుడు ఆత్మహత్య చేసుకోవడంతో చిత్రబృందం షాక్ కు గురైంది. వినోద్ ధోండాలే శుక్రవారం నాడు హీరో నీనాసం సతీష్ మరియు నిర్మాతలతో షూటింగ్ గురించి చర్చించినట్లు సమాచారం. శుక్రవారం షూటింగ్ ల గురించి మాట్లాడిన ఆయన శనివారం ఆత్మహత్యకు పాల్పడడం పలు అనుమానాలకు దారితీసింది. వినోద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వినోద్ సినిమా నిర్మాణం మరియు సీరియల్ నిర్మాణంలో కూడా పాలుపంచుకున్నారు. నిర్మాణం ప్రారంభించిన తర్వాత వినోద్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో వినోద్ ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వినోద్ దొండలే గత 20 సంవత్సరాలుగా కన్నడ టెలివిజన్‌లో చురుకుగా ఉన్నారు. ఇటీవల ‘నన్నరాసి రాధే’, ‘గంగే గౌరి’, ‘కరిమణి’ సీరియల్స్‌కి వినోద్ దొండలే దర్శకత్వం వహించారు. కొన్ని సీరియల్స్ కూడా వినోద్ దొండలే నిర్మించారు.