Leading News Portal in Telugu

Kalki 2898 AD 25 Days: ఓరి దేవుడా.. అప్పుడే 25 రోజులయ్యిందా..?


  • జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ.
  • భారీ విజయం అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరింది.
  • తాజాగా 25 రోజుల పోస్టర్ విడుదల.
Kalki 2898 AD 25 Days: ఓరి దేవుడా.. అప్పుడే 25 రోజులయ్యిందా..?

Kalki 2898 AD 25 Days Special Poster Release : కల్కి.. మైథాలజీ సైన్స్ ఫిక్షన్ గా తెరికెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ విజయం అందుకొని 1000 కోట్ల క్లబ్ లో చేరింది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే, దిశాపటాని, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్, శోభన, మాళవిక నాయర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లతోపాటు అనేకమంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. జూన్ 27న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టించింది. విడుదలైన ప్రతి చోట హిట్ టాక్ రావడంతో ప్రభాస్ రెండోసారి వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం ఈ సినిమా 1100 కోట్ల కలక్షన్స్ ను రాబట్టింది. ముందుముందు ఈ లెక్కలు మారవచ్చు కూడా.

Mr Bachchan vs Double iSmart: బాక్సాఫీస్ క్లాష్.. మాస్ vs మాస్ మహారాజా.. ఏమవుద్దో?

ఇకపోతే తాజాగా మూవీ మేకర్స్ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను విడుదల చేశారు. హీరో ప్రభాస్ కర్ణ పాత్రలో కనిపించే విధంగా సినిమా 25 రోజులు పూర్తి చేసుకుందంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో కర్ణ పాత్రలో ప్రభాస్ లుక్ చాలా పవర్ ఫుల్ గా కనబడే విధంగా పోస్టర్ ను డిజైన్ చేశారు. ఇటీవల హీరో ప్రభాస్ సినిమాను విజయం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ.. ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందించగా.. నాగ అశ్విన్ దర్శకత్వం వహించారు.

Stock Market vs SIP: స్టాక్ మార్కెట్ లేదా ఎస్ఐపీలో ఎందులో పెట్టుబడి ఉత్తమం..