Leading News Portal in Telugu

Google Chromecast: క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్..


  • క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్

  • దాని స్థానంలో Google TV స్ట్రీమర్ అనే కొత్త పరికరం

  • ఆగస్ట్ 13న పిక్సెల్ ఈవెంట్‌లో లాంచ్ అయ్యే అవకాశం.
Google Chromecast: క్రోమ్‌కాస్ట్ డాంగిల్‌లను నిలిపివేసిన గూగుల్..

ఈ సంవత్సరం వరకు గూగుల్(Google) అనేక ఉత్పత్తులు, యాప్‌లను నిలిపివేసింది. ఈ జాబితాలో క్రోమ్‌కాస్ట్‌ (Chromecast) అనే దానిని కూడా చేర్చారు. గూగుల్ వీడియో స్ట్రీమింగ్ పరికరం అయిన క్రోమ్‌కాస్ట్‌ని కూడా నిలిపివేయనుంది. ఈ సమాచారాన్ని మొదట 9To5 Google తెలిపింది. క్రోమ్‌కాస్ట్‌ను నిలిపివేసిన తర్వాత.. దాని స్థానంలో కొత్త ఉత్పత్తిని ప్రవేశపెట్టనున్నారని.. అది “Google TV స్ట్రీమర్”గా చెబుతున్నారు.

క్రోమ్‌కాస్ట్‌ అనేది టీవీ యొక్క HDMI పోర్ట్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఉపయోగించబడే స్ట్రీమింగ్ పరికరం. దీని సహాయంతో.. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు.. టాబ్లెట్‌లను టీవీకి కనెక్ట్ చేయవచ్చు. కంటెంట్‌ను టీవీలో ప్రసారం చేయవచ్చు. అందుకు ఇంటర్నెట్ కూడా అవసరం. Wi-Fi నెట్‌వర్క్‌కి కనెక్ట్ చేయడం ద్వారా.. వినియోగదారులు యూట్యూబ్, నెట్ ఫ్లిక్స్.. స్పాటీఫై వంటి యాప్‌ల నుండి వీడియోలు, మ్యూజిక్.. ఇతర వీడియాలను దీని సాయంతో చూడచ్చు.

ప్రస్తుత క్రోమ్‌కాస్ట్‌తో 4K వీడియోకు మద్దతు ఉంది. ఇందులో Amlogic S905X5 ప్రాసెసర్ ఉపయోగించబడింది. ఇది.. 2 GB RAM.. 8 GB స్టోరేజీని కలిగి ఉంది. దానితో పాటు రిమోట్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. భారతదేశంలో క్రోమ్‌కాస్ట్‌ ధర రూ. 10,000గా ఉంది. ఆగస్ట్ 13న జరగనున్న ఈవెంట్‌లో గూగుల్ టీవీ స్ట్రీమర్‌ను లాంచ్ చేయనున్నట్లు కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఈ ఈవెంట్‌లో గూగుల్ పిక్సెల్ సిరీస్ 9 లాంచ్ కానుంది. ఇందులో పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో, పిక్సెల్ 9 ప్రో ఎక్స్‌ఎల్.. పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఉన్నాయి.