Leading News Portal in Telugu

Rashmika: దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు


  • దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది

  • విజయ్ దేవరకొండ గురించి రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

  • విజయ్ దేవరకొండతో సినిమా చేసే ఆలోచనలు ఏమీ లేవు
Rashmika: దేవరకొండతో మాట్లాడాలంటే అదోలా అనిపించిది.. రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు

Rashmika Mandanna Intresting Comments on Vijay Deverakonda: విజయ్ దేవరకొండ రష్మిక మందన బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ మొట్టమొదటిసారిగా గీతగోవిందం అనే సినిమాలో కలిసి నటించారు. ఆ సినిమా తర్వాత రష్మిక తనకు జరిగిన ఎంగేజ్మెంట్ బ్రేక్ చేసుకోవడంతో అప్పటి నుంచి విజయ్ దేవరకొండ రష్మిక మధ్య ఏదో ఉందనే ప్రచారం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దానికి తోడు వీరిద్దరూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు కూడా రకరకాల హింట్స్ ఇచ్చే విధంగా ఉండటంతో ఈ ప్రచారం జరుగుతూనే వస్తోంది. వీళ్ళిద్దరూ ఎప్పుడూ తమ రిలేషన్ గురించి బాహాటంగా మాట్లాడింది లేదు. వీలైతే అప్పుడప్పుడు ఖండిస్తూనే వస్తున్నారు. కానీ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు మాత్రం కోరుతున్నారు. అయితే తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

Pranitha Subhash: : మళ్ళీ తల్లవుతున్నా.. ఇక అవి కష్టమే.. హీరోయిన్ ఆసక్తికర పోస్ట్

అదేంటంటే గీతగోవిందం సినిమా సెట్స్ లో విజయ్ దేవరకొండ పక్కన నటిస్తున్నప్పుడు అతని గత సినిమాల ఎఫెక్ట్తో అతనితో మాట్లాడాలంటే ఎందుకో బెరుకుగా అనిపించదని చెప్పుకొచ్చింది. అయితే ఆ సినిమాల్లో చూసిన విజయ్ దేవరకొండ వేరు, బయట విజయ్ దేవరకొండ వేరు అని తనకు త్వరగానే అర్థమైందని ఆమె వెల్లడించింది. సినిమాల్లో చూపించినట్టు కాకుండా బయట విజయ్ చాలా కూల్ అని ఎవరైనా ఈజీగా మాట్లాడగలిగే అంత మంచి వ్యక్తిని చెప్పుకొచ్చింది. బహుశా అందువల్లే తనకు విజయ్ తో వాళ్ళ ఫ్యామిలీతో మంచి బాండింగ్ ఏర్పడిందని ఆమె చెప్పుకొచ్చింది. ఫ్యూచర్లో విజయ్ తో సినిమా చేస్తారా? అని అడిగితే ప్రస్తుతానికైతే చేసే ఆలోచనలు ఏమీ లేవు అని ఆమె వెల్లడించింది. ప్రస్తుతానికి ఒకపక్క విజయ్ తన సినిమాల బిజీలో తాను ఉంటే రష్మిక సినిమాల బిజీలో ఆమె ఉంది. రష్మిక ఇప్పటికే పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయి నేషనల్ క్రష్ గా అలరిస్తుంటే విజయ్ పాన్ ఇండియా వైడ్ ఒక మంచి సాలిడ్ హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.