Leading News Portal in Telugu

Elon Musk vs Mark Zuckerberg: ప్లేస్ ఏదైనా.. టైం ఎప్పుడైనా.. సై అంటే సై..


  • సై అంటే సై అంటున్న ఎలన్ మస్క్.
  • మార్క్ జూకర్ బర్గ్ తో సయ్యాటకు సిద్ధమయ్యాడు.
  • సోషల్ మీడియాలో వైరల్ వీడియో.
Elon Musk vs Mark Zuckerberg: ప్లేస్ ఏదైనా.. టైం ఎప్పుడైనా.. సై అంటే సై..

Elon Musk vs Mark Zuckerberg Viral Video: ప్రపంచ కుబేరులలో ఒకరైన టెస్లా అధినేత ఎలన్ మస్క్ తాజాగా మెటా కంపెనీ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ తో సయ్యాటకు సిద్ధమయ్యాడు. సోషల్ మీడియా వేదికగా తామిద్దరం తల పడదామా.? అంటూ ఎలన్ మస్క్ పోరుకు పిలుస్తూ మరింత రెచ్చగొట్టాడు. అంతేకాదండి.. ఓ మాస్ డైలాగ్ కూడా వేశాడు.. టైం నువ్వు చెప్పిన సరే.. నన్ను చెప్పమన్నా సరే.., ఎక్కడైనా.. ఎప్పుడైనా సరే.. ఏదైనా రూల్స్ పెట్టుకో.. తాను రెడీ అంటూ టెస్లా అధినేత అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. సమయము, ప్రదేశం, రూల్స్ ఏవి పెట్టినా సరే.. పోరాడడానికి సిద్ధంగా ఉన్నట్లు టెస్లా అధినేత ఎలన్ మస్క్ తెలిపారు.

Landslides: మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి.. శిథిలాల కింద మరికొందరు

ఇజ్రాయిల్ ప్రధాని ప్రసంగానికి ముఖ్య అతిథిగా హాజరైనందుకు వెళ్తున్న ఎలన్ మస్క్ ఈ సవాలను విసిరాడు. ఇక ఈ విషయాన్ని సంబంధించిన వీడియో పై తాజాగా మెట అధినేత జూకర్ బర్గ్ స్పందించాడు. మనం నిజంగా పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామా.? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇక ఈ సంభాషణలో చూసిన నెటిజన్స్ వీడియోపై భారీగా స్పందిస్తున్నారు. నిజానికి ఈ విషయంలో ఎలన్ మస్క్ ఎందుకో సీరియస్ గా ఉన్నట్లుంది అంటూ వ్యక్తి కామెంట్ చేశారు. మరొకరు అయితే వీరిద్దరూ మరోసారి తలపడడం రోజు కోసం కాదు కానీ.. చివరిసారి కోసం ఎదురు చూస్తున్నాం అంటూ కామెంట్ చేశారు.