- పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్
- తులంపై రూ.150 పెరిగింది
- వెండి పెరగడం ఇదే మొదటిసారి

Gold Price Today in Hyderabad on 29 July 2024: గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. 2024 బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర రూ.5-6 వేల వరకు తగ్గింది. దాంతో బంగారం కొనేవారి సంఖ్య పెరిగింది. అయితే పెరిగిందని సంతోషించేలోపే పసిడి రేట్స్ మళ్లీ షాకిస్తున్నాయి. శనివారం తులంపై (22 క్యారెట్లపై) రూ.250 పెరగగా.. నేడు రూ.150 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (జూన్ 29) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,400లుగా.. 24 క్యారెట్ల ధర రూ.69,160గా ఉంది.
మరోవైపు గత మూడు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి కూడా నేడు పెరిగింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.500 పెరిగి.. రూ85,000గా నమోదైంది. గత 10 రోజుల్లో వెండి పెరగడం ఇదే మొదటిసారి. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.63,400
విజయవాడ – రూ.63,400
ఢిల్లీ – రూ.63,550
చెన్నై – రూ.64,150
బెంగళూరు – రూ.63,400
ముంబై – రూ.63,400
కోల్‌కతా – రూ.63,400
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.69,160
విజయవాడ – రూ.69,160
ఢిల్లీ – రూ.69,310
చెన్నై – రూ.69,980
బెంగళూరు – రూ.69,160
ముంబై – రూ.69,160
కోల్‌కతా – రూ.69,160
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.89,500
విజయవాడ – రూ.89,500
ఢిల్లీ – రూ.85,000
ముంబై – రూ.85,000
చెన్నై – రూ.89,500
కోల్‌కతా – రూ.85,000
బెంగళూరు – రూ.84,000