Leading News Portal in Telugu

Kaalam Raasina Kathalu: ఐదు జంటల ‘కాలం రాసిన కధలు’


Kaalam Raasina Kathalu: ఐదు జంటల ‘కాలం రాసిన కధలు’

Kaalam Raasina Kathalu to Release on August 29th: ఈ మధ్య రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే కంటెంట్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ క్రేజ్ లభిస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎన్వీ సాగర్ స్వీయ దర్శకత్వంలో ఆసక్తికరమైన చిత్రం కాలం రాసిన కథలు ను నిర్మించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పోస్టర్ని హీరో, బిగ్ బాస్ ఫేమ్ శివాజీ విడుదల చేశారు. పోస్టర్ విడుదల చేసిన అనంతరం, శివాజీ మాట్లాడుతూ “ఈ సినిమా టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి, ఘన విజయం సాధిస్తుందని అంటూ టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఏ క్రమంలో దర్శక నిర్మాత ఎంఎన్వీ సాగర్ సాగర్ మాట్లాడుతూ, “మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా సింహ భాగం షూటింగ్ జరిగింది.

Sangeeth Prathap: కారు ప్రమాదంలో ‘ప్రేమలు’ నటుడికి గాయాలు.. డ్రైవర్‌ అరెస్ట్‌?

యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన మా సినిమా ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారని అన్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయని ప్రకోకున్నారు. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు. ఇప్పటికే రిలీజయిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయని, ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు. ఇక శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి, అభిలాష్ గోగుబోయిన, ఉమా రేచర్ల , రోహిత్ కొండ, హాన్విక శ్రీనివాస్, రవితేజ బోనాల ,పల్లవి రాథోడ్, రేష్మ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.