Leading News Portal in Telugu

Gopi Chand: వారందరికీ రుణపడి ఉన్నాను.. హీరో గోపిచంద్..


  • 2001లో తొలి వలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన గోపీచంద్.
  • నేటితో 23 వసంతాలు పూర్తి చేసుకున్నాడు.
  • కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించిన గోపీచంద్.
Gopi Chand: వారందరికీ రుణపడి ఉన్నాను.. హీరో గోపిచంద్..

Gopi Chand: 2001లో తొలి వలపు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన గోపీచంద్ నేటితో 23 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా నటించిన గోపీచంద్ తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. మొదటి సినిమా తర్వాత జయం, నిజం, వర్షం లాంటి సినిమాలలో నెగిటివ్ రోల్స్ చేసి మెప్పించాడు. ఆ తర్వాత 2004లో విడుదలైన యజ్ఞం సినిమాతో తన కెరీర్ మలుపు తిరిగింది. ఇక అప్పుడు నుంచి ప్రతి ఏడాది ఓ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు గోపీచంద్.

Tollywood : పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ‘అల్లూ’ కార్యక్రమం.. ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో..?

ఇకపోతే తాజాగా గోపీచంద్ తన 23 ఏళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఓ నోట్ ను రిలీజ్ చేశాడు. ఈ నోట్ లో తాను సినీ పరిశ్రమకు వచ్చి 23 సంవత్సరాలు గడిచాయని.. ఈ ప్రయాణంలో నా నిర్మాతలకు, దర్శకులు, సహనటులు, సిబ్బంది అందరికీ రుణపడి ఉన్నానని తెలిపారు. అలాగే నటుడిగా నేను అనుభవించిన ఈ ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలియజేసాడు. ఇన్ని సంవత్సరాలుగా మీరందరూ నాకు చూపించిన నిరంతరం మద్దతు, ప్రోత్సాహానికి అలాగే మీడియా సభ్యులు, తెలుగు సినీ జర్నలిస్టులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తెలియచేశాడు. అలాగే ఎల్లప్పుడూ నా కోసం మీరందరూ ఉన్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ.. మీ మద్దతుకు, నా అభిమానులందరికీ పెద్ద చప్పట్లు అంటూ తెలిపారు. మీ ప్రేమ నన్ను ముందుకు నడిపిస్తుందని.. మీరందరూ ప్రతిరోజు నాకు అతి పెద్ద బలం అని త్వరలో విశ్వం సినిమాతో మిమ్మల్ని కలుస్తా అంటూ తెలిపారు.

Building Collapse : కుప్పకూలిన బిల్డింగ్.. 12 మందికి గాయాలు.. విచారణకు ఆదేశించిన మేజిస్ట్రేట్