Leading News Portal in Telugu

Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్ ఐఫోన్‌ వచ్చేస్తోంది!


  • ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేసిన అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు
  • ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావించని ఆపిల్
  • యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి లీక్ సమాచారం
  • 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటన
Foldable iPhone:యాపిల్ విశ్లేషకుడి తాజా ప్రకటన..ఫోల్డబుల్  ఐఫోన్‌ వచ్చేస్తోంది!

అన్ని పెద్ద పెద్ద టెక్ కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్‌లను విడుదల చేశాయి. అయితే యాపిల్ ఇప్పటికీ దాని గురించి చర్చించలేదు. అయినప్పటికీ యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి తరచూ నివేదికలు బయటకు వస్తుంటాయి. ఆపిల్ ఫ్లిప్ స్టైల్ ఫోల్డబుల్ ఐఫోన్‌లో పనిచేస్తోందని పేర్కొంటూ మరో కొత్త లీక్ రిపోర్ట్ వెలువడింది. ఆపిల్ ఫోల్డబుల్ ఐప్యాడ్/మ్యాక్‌బుక్‌లో కూడా పనిచేస్తోందని వార్తలు కూడా వస్తు్న్నాయి. దీని అంతర్గత డిస్‌ప్లే 18.8 అంగుళాలు ఉంటుందని చెబుతున్నారు.

READ MORE: Minister Seethakka: ములుగులో మంత్రి సీతక్క పర్యటన.. షెడ్యూల్ ఇదీ..

ఫోల్డబుల్ ఐఫోన్‌ను 2026లో విడుదల చేయనున్నట్లు యాపిల్ విశ్లేషకుడు జెఫ్ పు ప్రకటించారు. ఐఫోన్ 18 సిరీస్‌తో పాటు హైబ్రిడ్ ఐప్యాడ్ మరియు మ్యాక్‌బుక్‌లను కూడా విడుదల చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫోల్డబుల్ ఐఫోన్ గురించి నివేదికలో ఎక్కువ సమాచారం లేదు. ఇంతకు ముందు కూడా, ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి క్లెయిమ్‌లు చేసిన అనేక నివేదికలు ఉన్నాయి. అయితే ఫోల్డబుల్ ఐఫోన్‌కు సంబంధించి ఆపిల్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఐఫోన్ 16 లాంచ్ ఈవెంట్ వచ్చే నెలలో జరగబోతోంది. ఈ సిరీస్ కింద 4 కొత్త ఐఫోన్లు లాంచ్ కానున్నాయి. ఈసారి కెమెరా డిజైన్‌లో మార్పు కనిపించవచ్చు. ఐఫోన్ 16 సిరీస్ iOS 18తో ప్రారంభించబడుతుంది.