Leading News Portal in Telugu

ISRO Free Course: ఏఐ, మెషిన్ లెర్నింగ్‌పై ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. దరఖాస్తు చేసుకోండి


  • ప్రస్తుతం ప్రతి రంగంలోనూ ఏఐ.. ఎమ్ఎల్ వినియోగం
  • వీటిపై ఇస్రో ఇచిత శిక్షణ
  • ఆగస్టు 19 నుంచి 23 వరకు శిక్షణ
  • అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అందిస్తున్న ఐఐఆర్ఎస్
ISRO Free Course:  ఏఐ, మెషిన్ లెర్నింగ్‌పై ఇస్రో ఉచిత ఆన్‌లైన్ కోర్సు.. దరఖాస్తు చేసుకోండి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML) వినియోగం ఇప్పుడు ప్రతి రంగంలోనూ కనిపిస్తోంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 5 రోజుల ఉచిత ఆన్‌లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ఏఐ, ఎమ్ ఎల్ కి సంబంధించిన అవసరమైన నైపుణ్యాలను విద్యార్థులకు బోధించడానికి ఆగస్టు 19 నుంచి 23 వరకు ఆన్‌లైన్ కోర్సును అందించనుంది. ఈ కోర్సు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్(IIRS) అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో భాగంగా అందిస్తున్నారు. దీనికి హాజరు కావడానికి ఎటువంటి డబ్బు ఖర్చు చెల్లించాల్సిన అవసరం లేదు.

READ MORE: NTRNeel: తారక్ – ప్రశాంత్ నీల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ (IIRS) ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ 2007లో ప్రారంభించబడింది. ఇప్పటి వరకు ఇది 3500 కంటే ఎక్కువ నెట్‌వర్క్ ఇన్‌స్టిట్యూట్‌లకు చేరుకుంది. యూనివర్సిటీలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధనా సంస్థలు దీని వల్ల లాభపడ్డాయి. అయితే, ఇస్రో కొత్త కోర్సు నిపుణులు, విద్యార్థుల కోసం రూపొందించబడింది. పరిశోధకులు కూడా చేయగలరు. కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజినీరింగ్ రంగాలకు సంబంధించిన వ్యక్తులకు ఇది సహాయకరంగా ఉంటుంది. ఐదు రోజుల కోర్సు ఏఐ/ఎమ్ఎల్ పరిచయంతో ప్రారంభమవుతుంది.

READ MORE:Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి

మెషిన్ లెర్నింగ్ మెథడ్స్, డీప్ లెర్నింగ్ కాన్సెప్ట్‌లు, గూగుల్ ఎర్త్ ఇంజిన్ ద్వారా మెషిన్ లెర్నింగ్, పైథాన్ ఇన్ మెషిన్ మరియు డీప్ లెర్నింగ్ వంటి అంశాలను కోర్సులో పొందుపరిచారు. 19 నుంచి 23 ఆగస్టు 2024 వరకు నిర్వహించే ఈ కోర్సులో ఉపన్యాసాలు, వీడియో ఉపన్యాసాలు మొదలైనవి ఉంటాయి. ఈ కోర్సు ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇది ఐఐఆర్ఎస్-ఇస్రో ఈ-క్లాస్ ప్లాట్‌ఫారమ్‌లో నిర్వహించబడుతుంది. దీనికి మంచి ఇంటర్నెట్ కనెక్షన్, ప్రాథమిక కంప్యూటర్ హార్డ్‌వేర్ అవసరం.