Leading News Portal in Telugu

Gold Price Today: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?


  • పెరిగిన బంగారం ధరలు
  • తులం బంగారంపై 250 పెరిగింది
  • వెండి ధర మాత్రం తగ్గింది
Gold Price Today: పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?

Gold Rate Today in India on 12 August 2024: ఇటీవలి రోజుల్లో తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా రెండు రోజులు పెరిగి నిన్న స్థిరంగా ఉండగా.. నేడు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఆగష్టు 12) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700గా.. 24 క్యారెట్ల ధర రూ.70,580గా నమోదయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయాయవాడ, విశాఖపట్నంలలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.70,580గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,850 పలకగా.. 24 క్యారెట్ల ధర రూ.70,730గా నమోదైంది. బెంగళూరు, కోల్‌కతా, పూణే, కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.64,700 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.70,580గా ఉంది.

నేడు బంగారం ధరలు పెరగగా.. వెండి ధర మాత్రం తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.600 తగ్గి.. రూ.82,500గా నమోదైంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.87,500గా ఉంది. ఢిల్లీ, ముంబైలో కిలో వెండి ధర 82,500గా ఉండగా.. అత్యల్పంగా బెంగళూరులో రూ.79,000గా నమోదైంది. బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు మార్పులు చేర్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.