- మళ్లీ షాకిచ్చిన బంగారం ధరలు
- ఒక్కరోజే తులంపై వెయ్యి పెరిగింది
- హైదరాబాద్లో ఎంతో తెలుసా?

Gold Price Today in Hyderabad on 13 August 2024: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 2024 బడ్జెట్ తర్వాత ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు.. మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. భారీ షాక్ ఇస్తూ వరుసగా రెండోరోజు పసిడి రేట్స్ పెరిగాయి. నిన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250 పెరగ్గా.. నేడు ఏకంగా రూ.950 పెరిగింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.270 పెరిగితే.. నేడు రూ.1,040 పెరిగింది. దాంతో దేశీయంగా మంగళవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.65,650 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.71,620 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిన్న తగ్గిన వెండి ధర కూడా నేడు భారీగా పెరిగింది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ.1000 పెరిగి.. రూ.83,500గా నమోదైంది.
22 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.65,650
విజయవాడ – రూ.65,650
ఢిల్లీ – రూ.65,800
చెన్నై – రూ.65,650
బెంగళూరు – రూ.65,650
ముంబై – రూ.65,650
కోల్కతా – రూ.65,650
24 క్యారెట్ల బంగారం ధరలు:
హైదరాబాద్ – రూ.71,620
విజయవాడ – రూ.71,620
ఢిల్లీ – రూ.71,770
చెన్నై – రూ.71,620
బెంగళూరు – రూ.71,620
ముంబై – రూ.71,620
కోల్కతా – రూ.69,710
కిలో వెండి ధరలు:
హైదరాబాద్ – రూ.88,500
విజయవాడ – రూ.88,500
ఢిల్లీ – రూ.83,500
ముంబై – రూ.83,500
చెన్నై – రూ.88,500
కోల్కతా – రూ.83,500
బెంగళూరు – రూ.83,500