Leading News Portal in Telugu

Arshad Nadeem: లష్కరే తోయిబా ఉగ్రవాదితో ఒలింపిక్స్ విన్నర్ అర్షద్ నదీమ్..


  • లష్కరే తోయిబా ఉగ్రవాదితో పాకిస్తాన్ ఒలింపిక్స్ విన్నర్..

  • ఉగ్ర సంస్థ నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి అర్షద్ నదీమ్..

Arshad Nadeem: లష్కరే తోయిబా ఉగ్రవాదితో ఒలింపిక్స్ విన్నర్ అర్షద్ నదీమ్..

Arshad Nadeem: పాకిస్తాన్, అక్కడి ప్రజల్ని ఉగ్రవాదులతో విడదీసి చూడలేం. అక్కడి వారిలో ఉగ్రవాదం అంతగా పెనవేసుకుపోయింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్ గేమ్స్‌లో పాకిస్తాన్‌కి చెందిన అర్షద్ నదీప్ జావెలన్ త్రోలో ఏకంగా స్వర్ణం గెలిచాడు. 40 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌కి వ్యక్తిగత విభాగంలో స్వర్ణ పతకాన్ని తీసుకువచ్చాడు. అత్యంత పేదరికం, అక్కడి ప్రభుత్వం నుంచి సాయం లేకున్నా అతను గెలిచిన తీరుపై ఒక్క పాకిస్తాన్ నుంచే కాకుండా ఇండియాలో కూడా ప్రశంసలు దక్కాయి.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం అతడిపై వచ్చిన ప్రశంసలు ఒక్క ఘటనతో విమర్శలుగా మారుతున్నాయి. ఐక్యరాజ్యసమితిచే ఉగ్రవాదిగా గుర్తించబడిన, లష్కరే తోయిబా ఉగ్రవాదితో అర్షద్ నదీమ్ మధ్య సంభాషణ ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది. లష్కరే తోయిబా ఆర్థిక కార్యదర్శి హరిస్ ధర్‌ నిర్వహించిన సన్మాన కార్యాక్రమానికి నదీమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం కోసం యువతను ఆకర్షించేందుకు ఉగ్రసంస్థ దీనిని నదీమ్‌ని ఉపయోగించుకుంటుందని తెలుస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను రిక్రూట్ చేసుకునేందుకు అబోటాబాద్‌లోని ఫారెస్ట్ క్యాంపులను, పాకిస్తాన్ అంతటా స్మి్మ్మింగ్ క్యాంపులను లష్కరే డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి, హారిస్ ధర్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.