Leading News Portal in Telugu

Kolkata Doctor case: హత్యాచార ఘటన ఎఫెక్ట్.. కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు


  • కోల్‌కతా హత్యాచార ఘటన ఎఫెక్ట్

  • కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు
Kolkata Doctor case: హత్యాచార ఘటన ఎఫెక్ట్.. కాలేజీలకు NMC కీలక మార్గదర్శకాలు

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆదేశాల తర్వాత కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై జాతీయ వైద్య కమిషన్‌ అప్రమత్తం అయింది. ఈ మేరకు మెడికల్‌ కాలేజీలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వైద్య కళాశాలల్లో భద్రతకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్‌ కీలక సూచనలు చేసింది. వీటిని తప్పనిసరిగా అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. వైద్యులకు తప్పనిసరి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Kolkata Doctor case: వైద్యురాలి హత్యాచార ఘటనపై జేపీ నడ్డా కీలక వీడియో విడుదల

దేశవ్యాప్తంగా డాక్టర్లు, వైద్య విద్యార్థులు, ఫ్యాకల్టీకి కళాశాల, హాస్పిటల్‌ క్యాంపస్‌లలో భద్రతకు తగిన విధానాన్ని రూపొందించాలని సూచించింది. ఈ రక్షణ చర్యలు.. ఓపీడీ, వార్డులు, క్యాజువాలిటీ, హాస్టల్స్‌, నివాస ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లోనూ ఉండేలా చూడాలని తెలిపింది. వైద్యులు, వైద్యసిబ్బంది.. కారిడార్లలో తిరిగే సమయంలోనూ భద్రత ఉండేలా తగినంత రక్షణ సిబ్బందిని ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఇది కూడా చదవండి: CM Chandrababu: పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష..!

పురుషులతో పాటు.. మహిళా భద్రతా సిబ్బందిని తగినంత సంఖ్యలో అందుబాటులో ఉంచాలని తెలిపింది. ఏదైనా ఘటన జరిగితే వెంటనే కాలేజీ యాజమాన్యం స్పందించి కేసు నమోదు చేయించాలని పేర్కొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని 48 గంటల్లో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌కు పంపాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, మెడికల్‌ కమిషన్‌ బోర్డు సభ్యులు, అన్ని రాష్ట్రాల వైద్య విద్యా కార్యదర్శులకు ఎన్‌ఎంసీ పంపింది.