Leading News Portal in Telugu

Boy Kidnap: మెట్‌పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం


  • మెట్‌పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం
  • కిరాణా షాపుకు వెళ్తుండగా బైక్‌పై వచ్చి..
Boy Kidnap: మెట్‌పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం

Boy Kidnap: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. పట్టణంలోని దుబ్బవాడలో నివాసం ఉంటున్న లక్ష్మీ, రాజుల రెండేళ్ల కుమారుడు శివ తన అక్కతో కలిసి కిరాణా షాపుకు నడుచుకుంటూ వెళ్తుండగా.. ద్విచక్ర వాహనంపై ఓ వ్యక్తి వెంబడిస్తూ కొద్ది దూరం వెళ్లాడు. ఆ తర్వాత అక్కకు 20 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కు రావాలని చెప్పడంతో ఆ పాప అక్కడి నుంచి కిరాణం షాప్‌కు వెళ్లేలోపే బాలుడిని బైక్‌పై ఎక్కించుకొని గుర్తుతెలియని వ్యక్తి ఉడాయించాడు. బాలుని ఎత్తుకెళ్లే విషయం గమనించిన అక్క.. కేకలు వేస్తూ తన తల్లి దగ్గరకు వచ్చి విషయం చెప్పడంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు పట్టణంలో కొందరు గాలిస్తుండగా.. మరికొందరు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.