Leading News Portal in Telugu

Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్‌ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా


  • వార్తల్లో నిలుస్తోన్న సైనా
  • అథ్లెటిక్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు
  • నెటిజెన్‌కు సైనా కౌంటర్
Saina Nehwal: కామెంట్లు చేయడం ఈజీ.. గేమ్స్‌ ఆడటం చాలా కష్టం! ఇచ్చిపడేసిన సైనా

Saina Nehwal Hit Back To Netizen: వినేశ్‌ ఫొగాట్‌ అనర్హత వేటు అంశంపై కీలక వ్యాఖ్యలు చేసిన భారత స్టార్ షట్లర్, హైదరాబాద్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్.. జావెలిన్‌ త్రోయర్ నీరజ్ చోప్రా గురించి కూడా స్పందించారు. ‘నీరజ్‌ టోక్యో ఒలింపిక్స్‌ 2024 జావెలిన్‌ త్రోలో స్వర్ణం గెలిచాడు. ఆ తర్వాతనే అథ్లెటిక్స్‌లో ఇలాంటి ఈవెంట్‌ ఉందని తెలిసింది’ అని సైనా ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

‘కంగనా రనౌత్ ఆఫ్‌ స్పోర్ట్స్‌’ అంటూ సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి ఓ నెటిజెన్ కామెంట్ చేశాడు. ఆ వ్యాఖ్యలకు సైనా గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ‘మీరు ఇచ్చిన కాంప్లిమెంట్‌కు ధన్యవాదాలు. కంగనా చాలా అందంగా ఉంటారు. నేను నా గేమ్‌లో పర్‌ఫెక్ట్‌. ప్రపంచ నంబర్‌ వన్ ర్యాంకర్‌గా నిలిచా. దేశం తరఫున ఒలింపిక్‌ మెడల్‌ గెలిచాను. మీలాంటి వారికి ఇంట్లో కూర్చొని కామెంట్స్ చేయడం చాలా సులువు . గేమ్స్‌ ఆడటం చాలా కష్టం. నీరజ్‌ చోప్రా మన సూపర్ స్టార్. భారత్‌లో జావెలిన్‌ త్రో ప్రాచుర్యం పొందడంలో అతడిదే కీలక పాత్ర’ అని సైనా పేర్కొన్నారు.