Leading News Portal in Telugu

Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట


  • ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట..

  • గన్నవరం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన వంశీ..

  • ఈ నెల 20 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దు ఆదేశాలు జారీ చేసిన ఏపీ హైకోర్ట్
Vallabhaneni Vamsi: ఏపీ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట

Vallabhaneni Vamsi: గతేడాది ఫిబ్రవరి 20వ తేదీన గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన జరిగింది. కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు అక్కడ ఉన్న వెహికిల్స్ ను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లంతా వల్లభనేని వంశీ అనుచరులే అన్నది ప్రధాన ఆరోపణగా ఉంది. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. నిందితుల్లో ఎక్కువ మంది మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు చెప్పడంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాంతో ముందస్తు బెయిల్‌ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టును వంశీ ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై వాదనలు జరిగాయి. కక్షపూరితంగా కేసు పెట్టారని వంశీ తరపు లాయర్ వాదించగా.. దాడి వెనుక మాజీ ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇక, ఇరువురి వాదనలు విన్న హైకోర్టు.. ఈ నెల 20వ తేదీ వరకు ఎటువంటి తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.