Leading News Portal in Telugu

మువ్వన్నెల జాతీయ జెండా ఎర్రకోటపై మొదటిసారి ఎగిరింది ఆగస్టు పదహారు! | tiramga flag hoisted on red| forte on august| 16th| gandhiji| not| part| indipendence


శుభకర్ మేడసాని, జర్నలిస్ట్ 

భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వతంత్రం వచ్చినప్పుడు… ఆ వేడుకలకు దూరంగా  మహాత్మ గాంధీ ఏం చేస్తున్నారు?

మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? 

భారత స్వాతంత్రోద్యమానికి మహాత్మా గాంధీ నేతృత్వం వహించారు. కానీ, దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చినపుడు ఆ సంబరాలలో ఆయన పాల్గొనలేదు.

మహాత్మాగాంధీ స్వతంత్రం లభించిన రోజున దిల్లీకి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బెంగాల్‌లోని నోవాఖలీలో ఉన్నారు. అక్కడ ఆయన హిందూ, ముస్లింల మధ్య మత ఘర్షణలను అడ్డుకోడానికి నిరాహారదీక్ష చేస్తున్నారు.

ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తుందనే విషయం పక్కాగా తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్ భాయి పటేల్ మహాత్మాగాంధీకి లేఖ రాశారు. అందులో ఆగస్టు 15 మన మొదటి స్వతంత్ర దినోత్సవం అవుతుంది. మీరు జాతిపిత. ఇందులో పాల్గొని మీ ఆశీస్సులు అందించండి అని కోరారు.

గాంధీ ఆ లేఖకు సమాధానం ఇచ్చారు. కలకత్తాలో హిందూ-ముస్లింలు ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటున్నప్పుడు నేను సంబరాలు జరుపుకోడానికి ఎలా రాగలను. ఈ ఘర్షణలు ఆపడానికి నేను నా ప్రాణాలైనా విడుస్తా అన్నారు.

జవహర్ లాల్ నెహ్రూ తన చారిత్రక ప్రసంగం ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ని ఆగస్టు 14 అర్థరాత్రి వైస్రాయ్ లాంజ్(ప్రస్తుత రాష్ట్రపతి భవన్) నుంచి ప్రసంగించారు. నెహ్రూ అప్పటికి ప్రధానమంత్రి కాలేదు. ఆయన ప్రసంగాన్ని ప్రపంచమంతా శ్రద్ధగా ఆలకించింది. కానీ గాంధీ ఆరోజు 9 గంటలకే నిద్రపోయారు. లార్డ్ మౌంట్‌బాటన్ 1947 ఆగస్టు 15న తన ఆఫీసులో పనిచేశారు. మధ్యాహ్నం నెహ్రూ ఆయనకు తన మంత్రిమండలి సభ్యుల జాబితాను అందించారు. తర్వాత ఇండియా గేట్ దగ్గర ప్రిన్సెస్ గార్డెన్‌లో ఒక బహిరంగ సభలో మాట్లాడారు. ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున భారత ప్రధాన మంత్రి ఎర్రకోటపై జెండా ఎగరేస్తారు. కానీ, 1947 ఆగస్టు 15న మాత్రం అలా జరగలేదు. లోక్‌సభ సెక్రటేరియట్‌లోని పత్రాల ప్రకారం 1947 ఆగస్టు 16న నెహ్రూ ఎర్రకోటపై భారత జెండాను ఎగురవేశారు.

ఆగస్టు 15 వరకూ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు రేఖను నిర్ణయించలేదు. దానిని ఆగస్టు 17న రాడ్‌క్లిఫ్ లైన్‌గా ప్రకటించారు.

ఆగస్టు 15న భారతదేశానికి విముక్తి లభించింది. కానీ దేశానికి అప్పటివరకూ జాతీయ గీతం ఏదీ లేదు. జనగణమణ గీతాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ 1911లోనే రాసి ఉంచారు. అయితే, అది 1950లో జాతీయగీతం గౌరవాన్ని పొందింది.

ఆగస్టు 15న భారత్‌తోపాటు మరో మూడు దేశాలు కూడా స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి. దక్షిణకొరియా జపాన్ నుంచి 1945 ఆగస్టు 15న స్వతంత్రం పొందింది. బహరీన్‌కు 1971 ఆగస్టు 15న బ్రిటన్ నుంచి విముక్తి లభించింది. కాంగో 1960 ఆగస్టు 15న ఫ్రాన్స్ నుంచి స్వాతంత్రం పొందింది.

మహాత్మా గాంధీని ఎందుకు హత్య చేశారు? 

విధితో కలయిక ఆసన్నమైందని 1947 ఆగస్టు 15వ తేదీకి కొన్ని నెలల ముందు నుంచే కనిపిస్తోంది. కానీ ఆ రోజు ఆగమనం కోసం నిరీక్షణ , చుట్టూ అలముకున్న సంతోషంలో ఏదో లోటు ఉంది.

శతాబ్దాల తర్వాత బ్రిటిష్ పాలన, బానిసత్వం భారతదేశానికి అంతం కానున్నాయి. అయినా, స్వాతంత్ర్య సంబరం ఊహించినంతగా ఆవరించిలేదు. దానికి కారణం విభజన విషాదం. విద్వేషాగ్ని కూడా దానిని బూడిదగా దహించివేయలేకపోయింది. ఈ విషాదాన్ని సజీవంగా ఉంచిన అగ్ని అది.

అధికార బదలాయింపు కొందరికి కాస్త ఊరటనిచ్చింది. కానీ అటువంటి వారిలో గాంధీ లేరు. ఎన్నో సత్యాన్వేషణలతో ప్రయోగాలు చేసి, 78 ఏళ్ల వయసులో ఉన్న గాంధీ ఆలోచన మునుపటికన్నా ఎక్కువగా బలపడింది. కానీ ఆయన శరీరం శక్తికోల్పోయింది. ఆయన సంకల్ప బలానికి సరితూగటంలో శరీరం విఫలమవుతోంది. తనకు ఎదురవుతున్న భీకర సవాళ్లను దృష్టిలో పెట్టుకున్న గాంధీ దీనిని అంగీకరించలేకపోయారు.

1947 ఆగస్టుకు కొన్ని నెలల ముందు నుంచీ 1948 జనవరి వరకూ ఆయన తరచుగా పర్యటనలు చేసింది అందుకే. ఎక్కడ అల్లర్లు జరిగితే అక్కడి ప్రజల బాధలు, విషాదాలను పంచుకోవటానికి గాంధీ వెళ్లేవారు. విద్వేషాగ్ని కీలలను ప్రార్థనలు, సందేశాల ద్వారా చల్లార్చేందుకు ప్రయత్నించేవారు. భవిష్యత్తులో సాన్నిహిత్యం కొనసాగించటానికి మార్గాలను సూచించేందుకు ప్రయత్నించారు.

ఆర్ యస్ యస్ మతమౌఢ్యం, ఆర్ యస్ యస్ ఉన్మాదం నుంచి మానవతా మార్గం చూపటానికి తన మనసు లోతుల్లోనుంచి కృషిచేశారు.

ఆయన రావాలని ఆకాంక్షించిన ప్రదేశాలన్నిటికీ, ఆయనను చూడాలనుకున్న క్షతగాత్రుల్లో ప్రతి ఒక్కరినీ గాంధీ చేరుకోలేకపోయారు. ఒక చోట ఉంటూ ఇతర ప్రాంతాలకు శాంతి సందేశాన్ని, దూతను పంపేవారు. పరిస్థితులు మరింత ఎక్కువగా సంక్లిష్టంగా మారుతున్నాయి.

అవిభాజ్య భారతదేశం విస్తృతి కూడా చాలా విస్తారమైనది. కరాచీ ప్రభావం బిహార్‌లో కనిపించింది. నౌఖోలీ ప్రభావం కలకత్తా మీద కనిపించింది. విధ్వంసం చాలా ప్రాంతాల్లో కనిపించింది. విద్వేషాగ్ని ప్రతి చోటా ప్రజ్వరిల్లుతూ ఉండింది. ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. విద్వేషాగ్నిని విస్తరించే వారు, దాని నుంచి ప్రయోజనం పొందేవారు ప్రతి ఒక్కరికీ గాంధీ మీద ఫిర్యాదు ఉండింది. ఎందుకంటే వారి ఆకాంక్షలు ఇతరుల ఆకాంక్షలకన్నా భిన్నమైనవి.

హిందువులు లేదా ముస్లింలు లేదా సిక్కులు ఎవరి ఊచకోత జరిగినా.. గాంధీకి అది తన సొంత శరీర భాగాలను దహనం చేయటం లాంటిది. దీనిని ఆయన తన వైఫల్యంగా పరిగణించారు. అది ఆయన కలలకు వ్యతిరేకమైనది. ఆయను కుంగదీసింది. ’వామనుడి’ లాగా అవిభాజ్య భారతదేశాన్ని గాంధీ రెండు మూడు అంగల్లో కొలవాలనుకున్నారు కానీ కొలవలేకపోయారు. అది ఆయన విధి. విషాదభరిత విధి.

ఆగస్టు పదిహేనో తేదీ అర్థరాత్రి భారతదేశపు విధిని రూపొందించటంలో దిల్లీ తలమునకలైవుంది. అప్పటికి మూడు దశాబ్దాలుగా స్వతంత్ర సంగ్రామం విధానాన్ని, సంకల్పాన్ని, నాయకత్వాన్ని నిర్ణయించే మహాత్మా గాంధీ తన వారసులైన భావి దేశపు నిర్మాతలను ఆశీర్వదించటానికి అప్పుడక్కడ లేరు.

1947 ఆగస్టు 26న ముస్లింల పండుగ ఈద్-ఉల్-ఫితర్ నాడు కలకత్తా మైదానంలో ప్రార్థనా సమావేశంలో గాంధీ ప్రసంగం వినటానికి లక్ష మంది హిందువులు, ముస్లింలు హాజరయ్యారు

ఆయన దిల్లీ సరిహద్దులకు మైళ్ల దూరంలో కలకత్తా లోని ‘హైదరీ మహల్’లో ఉన్నారు. మైనారిటీ హిందువులు దారుణ ఊచకోతకు గురైన నౌఖోలీలో పర్యటించటానికి ఆయన వెళ్లారు. ఆయన కలకత్తాలో రెండు మూడు రోజులు ఉండాల్సి వచ్చింది. ఇక్కడ మైనారిటీ ముస్లింలు ఫిర్యాదు చేస్తున్నారు. నౌఖోలీలో విద్వేష జ్వాలలను నివారించటానికి కలకత్తాలో అగ్నిని చల్లార్చాల్సిన అవసరం ఉందని గాంధీ భావించారు.

కలకత్తాలో ముస్లింలకు భద్రతలేకుండా వదిలేస్తే, నౌఖోలీలోని హిందువులను ఎలా రక్షించగలనని ఆయన భావించారు. ఇక్కడ మైనారిటీలను పరిరక్షించాల్సిన బాధ్యత తనదని గాంధీ భావించారు. అది నౌఖోలీలోని మైనారిటీల హక్కులను పరిరక్షించటానికి ఆయనకు నైతిక మద్దతును కూడగట్టింది. కలకత్తాలో ఘోరకలి అనదగ్గ ప్రాంతంలో ఉండాలని గాంధీ కోరుకున్నారు.

ఒక ముస్లిం వితంతువుకు చెందిన ‘హైదరీ మహల్’ అందుకు తగిన స్థలం. అది హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతం. సమీపంలో మియా బాగాన్ అనే బలహీన వర్గానికి చెందిన ముస్లింల ఆవాస ప్రాంతముంది. అది కాలువకు అవతల ఉంటుంది. మియా బాగాన్‌లో ఎంతగా విధ్వంసం సృష్టించారంటే.. తమ దైన్యం గురించి చెప్పటానికి ఏ ఒక్కరూ అక్కడ లేకుండాపోయారు.

ఈ ‘హైదరీ మహల్’లో బస చేయటానికి గాంధీ ఒక షరతుతో ఒప్పుకున్నారు. సుహ్రావర్దీ కూడా అక్కడ ఉండాలన్నది ఆయన షరతు. అప్పటికి ఏడాది కిందట తన ‘ప్రత్యక్ష చర్య’తో వందలాది మంది హిందువులను చంపి, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన సుహ్రావర్దీ . హిందువుల పట్ల ద్వేషానికి అపకీర్తి పొందిన సుహ్రావర్దీ తన నేరాన్ని అంగీకరించి, శాంతి సందేశాన్ని వ్యాప్తి చేయటానికి అక్కడికి రావటానికి అంగీకరించారు.

గాంధీ మరో షరతు పెట్టారు: కలకత్తాలోని ముస్లిం లీగ్ నేతల్లో అతివాదులు నౌఖోలీలోని తమ ‘జనాని’కి వైర్ సందేశం పంపి, అక్కడి హిందువులను రక్షించేలా చేయటం, అక్కడ శాంతి వాతావరణం నెలకొల్పేలా చేసేందుకు తమ కార్యకర్తలను పంపించటం.

గాంధీ షరతులకు అంగీకరించారు. కలకత్తా జనం తమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొనసాగించారు. కానీ ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు చెందిన యువతలో భ్రమలు అలాగే ఉండిపోయాయి. వారు గాంధీని కేవలం ముస్లింల సమర్థకుడిగా మాత్రమే భావించారు. హిందువులు కష్టాల్లో ఉన్నపుడు ఎందుకు రాలేదని, హిందువులు పారిపోతున్న ప్రాంతాలకు ఎందుకు వెళ్లలేదని వారు ఆయనను ప్రశ్నించేవారు. గాంధీని ‘హిందువుల శత్రువు’ అని వారు అభివర్ణించారు.

పుట్టుకలో, ఆచారంలో, జీవనశైలిలో, నమ్మికలో, విశ్వాసంలో పూర్తిగా హిందువు అయిన ఒక వ్యక్తి మీద చేసిన ఆరోపణ ఇది. !  దీనికి స్పందిస్తూ గాంధీ కూడా అదే చెప్పారు. గాంధీని హిందువుల శత్రువుగా ఆరోపించటం తీవ్రంగా బాధించేది.

ఆగస్టు పదిహేనును గాంధీ ఒక ’గొప్ప ఘటన’గా పరిగణించేవారు.  ఉపవాసం, ప్రార్థనలు, పశ్చాత్తాపంతో ఆహ్వానించాలని ఆయన తన అనుచరులకు చెప్పారు. ఆయన స్వయంగా ఆ మహా పర్వ దినానికి అదే రీతిలో స్వాగతం పలికారు.

కలకత్తాలో గాంధీ విజయవంతమయ్యారు. శాంతియుత వాతావరణం అక్కడ విస్తరించటం మొదలైంది. మహాత్ముడి ఆదర్శాల ప్రభావం సైనిక శక్తి కన్నా బలమైనది. అందుకే.. చివరి వైశ్రాయ్, మొదటి గవర్నర్ జనరల్ మౌంట్‌బాటన్ వైర్ సందేశంలో ఆయనకు ఇలా అభినందనలు తెలిపారు: ‘‘పంజాబ్‌లో మనకు యాభై ఐదు వేల మంది సైనికులున్నారు. కానీ అల్లర్లు అదుపుకాలేదు. బెంగాల్‌లో మన సైన్యానికి చెందని ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. అక్కడ సంపూర్ణ శాంతి నెలకొంది.’’

నౌఖోలీకి వెళ్లటానికి ముందు కలకత్తాలో కొన్ని రోజులు ఉండాలని గాంధీ భావించారు. కానీ ఆయన నెల రోజుల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. తుపాకీమందు గుట్ట మీద ఉండి ఒక్క అగ్గిరవ్వ తగిలితే విస్ఫోటనానికి సిద్ధంగా ఉన్న ఆ నగరం గాంధీని వెళ్లనివ్వలేదు. ఆ తుపాకీమందు మండే స్వభావాన్ని గాంధీ ధ్వంసం చేశారు. అగ్గిరవ్వ కూడా ఆరిపోయింది.

నాటికి కేవలం ఏడాది కిందట హిందువులను తీవ్రంగా వ్యతిరేకించిన సుహ్రావర్దీ ఇప్పుడు ఒక కొత్త ఆదర్శం. ఆయన ప్రతిజ్ఞను చూసి జనం ఆశ్చర్యపోయారు. అల్లర్లకు పాల్పడుతున్న హిందూ యువత కూడా పాశ్చాత్తాప పడింది.

దిల్లీ గాంధీని పిలుస్తోంది. వేడుక వాతావరణం నిరర్థకమైంది. ఇప్పుడు దిల్లీకి గాంధీ అవసరముంది. దిల్లీ మరోసారి కలకత్తా జనంతో నిండిపోయింది. దిల్లీ మహాత్ముడి కోసం నైరాశ్యంతో నిరీక్షిస్తోంది.

గాంధీ సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం దిల్లీ చేరుకున్నారు. బేలూరు నుంచి రైలులో వచ్చారు. చిరపరిచితమైన ఈ సెప్టెంబర్ ఉదయం ఆనందదాయకమైన ఉదయం కాదని గాంధీ తెలుసుకున్నారు. అన్నిచోట్లా స్మశాన నిశబద్దం ఆవరించివుంది. అన్ని మర్యాదలకూ బీటలు పడ్డాయి.

రైల్వే స్టేషన్‌లో గాంధీని ఆహ్వానించటానికి సర్దార్ పటేల్ వచ్చారు. కానీ ఆయన ముఖంలో నవ్వు మాయమైంది. పోరాటంలో కష్ట కాలంలోనూ సంతోషంగా కనిపించే అదే సర్దార్‌ ముఖంలో ఇప్పుడు నిస్పృహ కనిపించింది. వస్తారని అనుకున్న ఇతర ఆర్ యస్ యస్ పెద్దమనుషులు రైల్వే స్టేషన్ వద్ద కనిపించలేదు. గాంధీ ఆందోళనకు ఇది చాలు.

సర్దార్ కారులో కూర్చుంటూ మౌనం వీడారు ఐదు రోజులుగా అల్లర్లు జరుగుతున్నాయి. దిల్లీ ఇప్పుడు శవాల నగరంగా మారింది.

గాంధీని ఆయనకు ప్రియమైన వాల్మీకి టౌన్‌షిప్‌కు తీసుకెళ్లలేదు. బిర్లా భవన్‌లో ఆయనకు బస ఏర్పాటు చేశారు. కారు అక్కడికి చేరుకోగానే ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ కూడా వచ్చారు. అది కాకతాళీయం కాదు. ఆయన ముఖ రూపం మారిపోయింది. ఒక్క నెల రోజుల సమయంలోనే ఆయన ముఖంలో ముడతలు అనూహ్యంగా పెరిగిపోయాయి.

ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ‘బాపు’ అంటూ గుక్కతిప్పుకోకుండా అంతా చెప్పారు. లూటీ, ఊచకోత, కర్ఫ్యూ.. అన్ని వివరాలూ తెలియజేశారు. ఆహారపదార్థాలు అందుబాటులో లేవు, సాధారణ పౌరుడి దీనస్థితి, పాకిస్తాన్‌ను తన పౌరులను రక్షించుకోవాలని తను ఆ దేశానికి ఎలా చెప్పగలరు?

హిందువులు, ముస్లింలు అనే తేడా లేకుండా అందరికీ సేవ చేస్తుండే డాక్టర్ జోషి అనే ప్రఖ్యాత సర్జన్ గురించి ప్రస్తావించారు. ఆయనను ఒక ముస్లిం ఇంటి నుంచి తుపాకీతో కాల్చారు. గాంధీ ప్రతి రోజూ తన మనోభావాలను ప్రార్థనా సమావేశంలో చెప్పేవారు. అది రేడియోలో ప్రసారమయ్యేది. బహుశా ఈ ప్రయత్నాలు సరిపోలేదు.

పాకిస్తాన్ నుంచి వస్తున్న హిందువులు, సిక్కుల సంఖ్య తగ్గలేదు. ఈ జనం రక్తానికి బదులుగా రక్తం కావాలంటున్నారు. గాంధీ మాటలు వారికి రుచించలేదు. ఈ మనిషి పాకిస్తాన్ మీద నైతిక ఒత్తిడి తెస్తున్నారన్నది కూడా వారు చూడలేకపోయారు. తన పౌరులకు భద్రత కల్పిస్తానన్న జిన్నా హామీని ఆయనకు గుర్తుచేశారు.

భారతదేశానికి కూడా దాని హామీని గాంధీ గుర్తుచేస్తున్నారు. ఆ హామీని నెరవేర్చటంలో నైతిక బలం పెరగటాన్ని గాంధీ చూసేవారు. ఆయన ప్రతి రోజూ ప్రణాళిక రచించేవారు. వాటిని అమలు చేసేవారు. జనవరి వణికించే చలి వచ్చింది. భారత్ కానీ, పాకిస్తాన్ కానీ తమ విశ్వాసాలను ఉల్లంఘించాయని గాంధీ భావించలేదు.

యాభై ఐదు కోట్ల రూపాయలను విశ్వాస అనుసంధానంగా ఆయన పరిగణించారు. విశ్వాసాన్ని, నమ్మకాన్ని కాపాడేందుకు ఎవరికైనా ఎదురు వెళ్లేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. చివరికి తనను తానే వ్యతిరేకించటానికి కూడా. గాంధీ అదే స్ఫూర్తి నుంచి నైతిక బలం పొందేవారు.

సమీప భవిష్యత్తులో పాకిస్తాన్ వెళ్లాలనేది ఆయన ప్రణాళిక. జిన్నాను, ఆయన ప్రభుత్వాన్ని అంతకుమించి పరిగణించలేదు. శాంతి నెలకొల్పుకోవటమనే ఆలోచన ఆర్ యస్ యస్ హిందూ మహాసభకు నచ్చలేదు. గాంధీ నిరాహారదీక్షలో స్వీయ-సత్యసంధతను వీరు చూడలేదు.

ప్రపంచం గాంధీకి అనుకూలంగా నినాదాలు చేస్తున్నట్లు అనిపించినప్పుడు..   ఆర్ యస్ యస్ వారు ‘గాంధీ ముర్దాబాద్’ అని నినాదాలు చేసేవారు. ఆధ్యాత్మిక స్వచ్ఛతతో పవిత్రంగా విలసిల్లినటువంటి ప్రపంచంలోని అత్యుత్తమ ఆలోచనను.. నాథూరాం గాడ్సేకు చెందిన సైద్ధాంతిక శాఖ ఆర్ యస్ యస్ ,  బిజెపి ఎన్నడూ అర్థం చేసుకోజాలవు.

బాపు మమ్మల్ని క్షమించు..! 

మహాత్మా గాంధీ హత్య అమానుష పాపానికి పాల్పడింది ఆర్ఎస్ఎస్, ఆనాడు ఉపప్రధానిగా, హోంమంత్రిగా ఉన్న సర్దార్ పటేల్ ,గాంధీ హత్యకు నిరసనగా RSSను ,నిషేధించాలని1949లో తన ప్రసంగంలో మత ప్రాతిపదికన రాజకీయాలు , హిందూ రాజ్ అనేది ఒక వెర్రి భావన అని ఈసడించారు.

ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు ప్రభుత్వ రాజ్యవ్యవస్థ మనుగడకు ప్రమాదకరం అన్నారు .ఈ వాతావరణం అంతిమంగా గాంధీజీని బలిగొన్నది ,గాంధీ హత్య గురించి తెలియగానే ఆర్ఎస్ఎస్ ,ఆనందోత్సాహాలతో మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు.దేశానికి తీరని నష్టం గాంధీజీ హత్య! ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించినా! నిషేధాన్ని ఎత్తివేయడానికి కారణం

ఆర్ఎస్ఎస్ నుంచి లిఖితపూర్వక వాగ్దానం. ఆర్ఎస్ఎస్ రాజకీయాలతో ప్రమేయం పెట్టుకోకూడదు అది కేవలం సాంస్కృతిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం అని పటేల్ పట్టుబడితే దాన్ని ఆర్ఎస్ఎస్ లిఖితపూర్వకంగా అంగీకరించినందున 

1949 జూలై 11న ఆర్ యస్ యస్ పై నిషేదాన్ని తొలగించారు!

మనసు కలసివేసే సంఘటన ! గుండెలు పగిలిపోయే వేదన ! 

మనలో చాలా మందికి గాంధీపై లేదా కాంగ్రేస్ పార్టీ పై అయిష్టత ఉండి వుండవచ్చు ! 

భారతదేశ స్వాతంత్రం తరువాత అధికారంలోకి వచ్చిన * “రాజకీయ పార్టీ కాంగ్రెస్ “ కు గాంధీకి సంబంధం  లేదు ! 

స్వాతంత్రం సిద్దించటానికి కాంగ్రెస్ అనే గొడుగు క్రిందకు యావత్ దేశం వచ్చి పోరాడింది ! ఒక్క ఆర్ యస్ యస్ !  Congress is an alternative name for a large national or international conference . కాంగ్రెస్ పదానికి అర్థం జాతీయ లేదా అంతర్జాతీయ సమావేశానికి ప్రత్యామ్నాయ పదం ! కనీసం ఆ పదానికి అర్థం తెలియకుండా మనలో చాలా మంది ఒకనాటి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తారు ! ఆనాటి కాంగ్రెస్ అంటే మన మందరం అంటే దేశం మొత్తం !జాతి మొత్తం ! ఒక్క ఆర్ యస్ యస్ తప్ప ! 

డా. BR అంబేత్కర్ కూడా కాంగ్రెస్ లో భాగమే . ఆతరువాత ఏర్పడ్డ తొలి స్వాతంత్ర భారత ప్రభుత్యంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసి హిందు కోడ్ బిల్లుకు ప్రాణం పోసాడు డా.అంబేత్కర్ . ఏంటి ఈ హిందూ కోడ్ బిల్ ? the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoptions and Maintenance Act. హిందూ కుంటుంబాల క్షేమం కోసం హిందు వివాహా చట్టం విడాకులు /భరణం / పునర్వివాహం , పిల్లలు , సంరక్షణ, ఆస్తులు , హక్కులు , దత్తత మొదలగు అంశాలు . ఆనాడు ఈ ఆర్ యస్ యస్ మూక ఏం చేసిందో తెలుసా! ఇండియా గేట్ వద్ద ఆనాటి  హిందూ కోడ్ బిల్  చట్టం ప్రతులను తగలబెట్టి అంబేత్కర్ ను నాటి కాంగ్రేస్ ప్రభుత్వాన్ని బండ బూతులు తిట్టారు . ఆర్ యస్ యస్  అంటే మనువాద అధర్మ భావజాలం పునాదులపై నిర్మించిన రాకాశి కోరల విష వలయం . భర్త చనిపోతే అదే చితి మంటలో బలవంతంగా తోసేసిన భావజాలం ! ఆమంటలు తట్టుకోలేక చితినుండి బయటపడే ప్రయత్నం చేస్తే ! చుట్టూ పెద్ద పెద్ద కర్రలతో ఆమెను బయటకు రాకుండా విచక్షాణా రహితంగా గొడ్డును బాదినట్టు బాదేవారు ఈ దారుణాన్ని బ్రిటీష్ పాలకుడు సర్ చార్లెస్ నేపియర్ తీవ్రంగా వ్యతిరేకించి చట్టం తెచ్చాడు . against the practice of sati ; Sir Charles Napier ordered to hang to death any Hindu priest who presided over a widow burning. ఈ వికృత తంతులో పాల్గొన్న పూజారిని చచ్చెవరకు ఉరితీయండి అనేది ఉత్తర్వులు . ఇదే అంశం మీద అభ్యుదయ బ్రాంహ్మణ కులానికి చెందిన మహానీయుడు రాజా రామ్ మోహన్ రాయ్ చితి మంటల్లో ఆడబిడ్డలు కాలిపోకుండా దేశవ్యాప్త ఉద్యమం నడిపారు. ఇక ఆ తరువాతి కాలంలో కాల్చడం ప్రక్కన పెట్టి భర్త చనిపోతే గుండు కొట్టించి తెల్లచీర కట్టించి బ్రతికినంత కాలం ఇతరుల కంట పడకుండా దాక్కుని బ్రతకాలి ! దాన్ని బద్దలు కొట్టాడు అంబేత్కర్ . ఈ రోజు హిందూ స్త్రీలు / పిల్లలు / పురుషులు హక్కులు అనుభవిస్తున్నారంటే కారణం నాటి కాంగ్రేస్ ప్రభుత్యం తొలిన్యాయ శాఖ మంత్రి అంబేద్కర్ కావడం విశేషం.  మనువాద ఆర్ యస్ యస్  భావజాల  కుల వ్యవస్థ ! వేల సంవత్సరాల అసమానతలు , అకృత్యాలు , కులాల పుట్టుకకు కారకులు ఈ  మనువాద ఆర్ యస్ యస్  భావజాలం కారణంగా ఈ దేశం  నిత్యం తగలబడుతునే ఉంది ! ఇది ఆరని ఖర్చిచ్చు ! ఆర్ యస్ యస్  బ్రిటీష్ బూట్లు ఎలా నాకింది ! ?ఎందుకు నాకింది ! ?స్వతంత్ర పోరాటాన్ని అణచటానికి పొట్టి కాకి నిక్కర్లు వేసుకుని బ్రిటీష్ మోరల్ పోలీస్ గా ఉద్యమకారులపై విరుచుకు పడటం ! బ్రిటీష్ స్వాతంత్రం ఇచ్చె సమయంలో 565 Princely states రాజ సంస్థానాలు  బ్రిటిష్ తొత్తులుగా ఉండేవారు ! వీరి సంస్థానాలను ఇండియలో కలపొద్దు అని ఆర్ యస్ యస్  ఎందుకు కుతంత్రం చేసింది ఇంకోసారి వివరంగా చెప్పుకుందాం .  అన్నిటికంటే కృరమైన భావజాలం విభజన !  ఈ దేశం రెండు ముక్కలు అవ్వటానికి కారకులు ఎవరో తెలుసా ! ఇంకెవరు ! వేర్పాటు వాద ఛాందస మూఢ భావాజం వారసులు . ఆర్ యస్ యస్ చాంధస మనువాద భావజాలం అదే చాంధస మత  మౌడ్యం మహ్మద్ జిన్నాను విభజనకు ఆనాడు దేశాన్ని మంటల్లోకి తోసింది ! ముందుండి నడిపించింది .

ఈ అతివాద భావజాలమే లక్షలాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయేలా చేసింది. . నేటి ఆధునిక హిందుస్తాన్ చరిత్ర చూస్తూనే ఉన్నాం ! నేటి కాంగ్రెస్ పార్టీని విమర్శించటం / పొగడటం మీ ప్రాధమిక హక్కు ! మీకు ప్రాధమిక హక్కులు కల్పించే పరిస్థితి నాటి గాంధీ సారధ్యం వహించిన కాంగ్రేస్ తోనే సాధ్యం అయ్యింది అని గుర్తుంచుకోండి ! తొలి తరం కాంగ్రెస్ పెద్దలు తమ సర్వస్వం దేశానికి ధారపోసారు ! ప్రాణాలు సైతం అర్పించారు ! ఇప్పుడు ఆమహానీయుల వారసులు ఎక్కడున్నారు ? ఏంచేస్తున్నారు మనకు పట్టదు . చివరగా ఒక మాట  గాంధీని గాంధీతత్వాన్ని విమర్శించడం అంటే మనం అరువు తెచ్చుకున్న అజ్ఞానం కారణం అని అర్ధం.  ఆర్ యస్ యస్ / బిజెపి అంతలా ఎందుకు గాంధీని విమర్శిస్తుంది అంటే గాంధీ తత్వం ఆర్ యస్ యస్ భావజాలనికి పూర్తి వ్యతిరేకమైనది అనేగా అర్థం! సత్యం కూడా అదే గాంధీ ఔనత్యం మనకంటే బయటవారే ఎక్కువ అర్ధం చేసుకున్నారు .  ” మహాత్మా మిమల్ని చంపుకోవడం! మీ రక్తంతో ఈ నేల తడవడం కంటే మహా పాపం ఉంటుందా ..! మహాత్మా మమ్ములను క్షమించు అది హత్య మాత్రమే కాదు… ఆధునిక భారత నిర్మాణం పై ఆరెస్సెస్‌ తొలి వేటు మహాత్మా గాంధీ జీవితంతో పాటు మరణం కూడా ఎప్పటికప్పుడు చరిత్ర కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. ప్రత్యేకించి ఆరెస్సెస్ బిజెపి సాగించే వ్వ్యక్తిత్వ హననం,విధాన హననం వంటి ముప్పేట ముష్కర వ్యూహాలదే పైచేయి అవుతున్న నేటి తరుణంలో  జాతి పితగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహాత్మా గాంధీని నేటి పాలకులు చీపురు పుల్లకు సరిపెట్టారు.

హంతకులే రొమ్ము విరుచుకుని తిరగటం అన్నది మధ్యయుగాల  సంస్కృతిలో తప్ప ఆధునిక సంస్కృతిలో కనిపించని లక్షణం.కానీ ఉన్నావో మొదలు హథ్రస్‌ , మణిపూర్ వరకూ నిందితులంతా పాలకపక్షం పంచన చేరి సన్మానాలందు కుంటున్నారు.ఈ ఒరవడి గాడ్సేను దేశభక్తుడిగా కీర్తించటంతోనే మొదలైంది. హంతకులు ఛాతీ విరుచుకుని నడవటమే వీరత్వమన్న బిజెపి  సంఘ పరివారం సైద్ధాంతిక నేపథ్యమే దీనికి పునాది. ఈ పునాదులు దశాబ్దాలుగా అంత కంతకూ బలోపేతం అవుతూ వస్తున్నాయి. అందుకే పార్లమెంట్‌లో గాంధీ విగ్రహానికి ఎదురుగా గాంధీ హత్యకు ప్రేరేపించిన సనాతన వైదిక బ్రాహ్మణ మతదేశం స్థాపించాలనే  భావజాలానికి ఆది గురువైన సావర్కార్‌ విగ్రహం నిలబెట్టి గాంధీ విలువలనే కాదు. ఆధునిక భారతదేశం గురించి గాంధీ కన్న కలలను ప్రశ్నిస్తోంది. జీవిత కాలంలో గాంధీ పాటించిన విలువలు, సాగించిన ఉద్యమాలు, సాధించిన విజయాలు, కన్న కలలు, నిర్మించతల పెట్టిన జాతి నిర్మాణం గురించి అధ్యయనం చేయటం ఎంత ప్రాధాన్యత కలిగిన అంశమో ఆయన మరణంపై అంశాలను ఎలా ప్రభావితం చేశాయో అధ్యయనం చేయటం కూడా అంతే ప్రాధాన్యత కలిగిన అంశం. దేశ స్వాతంత్య్రానికీ స్వావలంబనకూ చేటుతెచ్చే విధానాలను,విదేశీ,స్వదేశీ కార్పొరేట్లకు దేశసంపద ను దోచిపెట్టే విధానాలను అమలు చేస్తున్నారు.వీటిని ప్రజలందరూ ప్రతిఘటించేందుకు ఐక్యం కాకుండా ఉండేందుకు మతతత్వ,మనువాద సనాతన ధర్మం పేరుతో   రాజకీయాలు ముందుకొచ్చాయి.వాటిని సమర్ధించుకోవడానికే నిజమైన జాతీయోద్యమానికి, దాని నాయకులకు మసిపూసి,చరిత్రనువక్రీకరించి,గాడ్సేలను హీరోలుగా చిత్రీకరిస్తున్నారు.తమ దేశద్రోహాన్ని బూటకపు హిందూత్వ జాతీయవాదంతో కప్పిపుచ్చు కుంటున్నారు.