Leading News Portal in Telugu

Team India Players: భారత ఆటగాళ్లకు నెలకు పైగా సెలవులు!


  • భారత ఆటగాళ్లకు భారీగా సెలవులు
  • 40 రోజుల విశ్రాంతి
  • సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాతో టెస్ట్ సిరీస్‌
Team India Players: భారత ఆటగాళ్లకు నెలకు పైగా సెలవులు!

IND vs BAN Schedule: గత ఏడాది కాలంగా వరుస మ్యాచ్‌లు ఆడుతున్న భారత ఆటగాళ్లకు భారీగా సెలవులు దొరికాయి. దాదాపుగా 40 రోజుల విశ్రాంతి లభించనుంది. గత కొన్ని నెలలుగా భారీ షెడ్యూల్‌తో బిజీగా ఉన్న టీమిండియా ఆటగాళ్లకు ఈ 40 రోజుల విశ్రాంతి భారీ ఉపశమనం కలిగించనుంది. శ్రీలంక పర్యటన అనంతరం స్వస్థలాలకు వెళ్ళిపోయిన ప్లేయర్స్.. కుటుంబంతో కలిసి సరదాగా గడపనున్నారు. విదేశీ టూర్స్ వేసే అవకాశం కూడా ఉంది.

ఇటీవల ముగిసిన శ్రీలంక పర్యటనలో మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్‌ను మాత్రం 0-2తో కోల్పోయింది. ఇక సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌ ఆరంభం కానుంది. రెండు టెస్ట్‌లు, మూడు టీ20ల సిరీస్ కోసం భారత్‌కు బంగ్లా రానుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్‌షిప్‌ 2025లో భాగంగా జరిగే ఈ టెస్ట్ సిరీస్ భారత్‌కు చాలా ముఖ్యం. డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగాలంటే ఈ సిరీస్‌ను గెలవాల్సిందే. సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 5 వరకు భారత గడ్డపైనే ఈ సిరీస్ జరగనుంది.

బంగ్లాదేశ్‌తో టెస్ట్ షెడ్యూల్:
# తొలి టెస్ట్: సెప్టెంబర్ 19 నుంచి 23, చెన్నై
# రెండో టెస్ట్: సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1, కాన్పూర్

బంగ్లాదేశ్‌తో టీ20 షెడ్యూల్:
# తొలి టీ20: అక్టోబర్ 6, ధర్మశాల
# రెండో టీ20: అక్టోబర్ 9, ఢిల్లీ
# మూడో టీ20: అక్టోబర్ 12, హైదరాబాద్