- విజయవాడ-ఢిల్లీ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీసు ప్రారంభం..
-
సెప్టెంబర్ 14 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కాబోతున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి.. -
ఢిల్లీ- అమరావతి అనుబంధం మరింత పెరగనుంది: విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు

Vijayawada Airport: ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ మధ్య అనుసంధానం మరింత పెరుగుతోంది. ఢిల్లీకి వెళ్లేందుకు ఇండిగో సంస్థ ప్రతిరోజు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకోవడానికి తాను ఎంతగానో సంతోషిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే, ఇది సాధ్యం చేసిన వారందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
కాగా, విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రతి రోజు ఇండిగో విమానం ఢిల్లీకి రాకపోకలు కొనసాగించనుంది. ‘సెప్టెంబర్ 14వ తేదీ నుంచి విజయవాడ- ఢిల్లీ మధ్య రాకపోకలు స్టార్ట్ కానున్నాయి. ఈ విమానాల అనుసంధానంతో ఢిల్లీ- అమరావతి మధ్య అనుబంధం మరింత పెరగనుంది. ఈ సందర్భంగా విమాన రాకపోకల సమయాన్ని ఇండిగో విమానయాన సంస్థ వెల్లడించింది. విజయవాడ నుంచి ఢిల్లీ: బయలుదేరు సమయం ఉదయం: 11.10 గంటలకు, ఢిల్లీకి చేరుకునే సమయం మధ్యాహ్నం: 1.40 గంటలకు.. ఇక, ఢిల్లీ నుంచి విజయవాడ: బయలుదేరు సమయం రాత్రి 08.10 గంటలకు, విజయవాడకు చేరుకునే సమయం రాత్రి 10.40 గంటలుగా నిర్ధారించారు.