Leading News Portal in Telugu

RN Agarwal: భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత


  • భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత

  • అనారోగ్యం తుది శ్వాస విడిచిన క్షిపణి లెజెండ్
RN Agarwal: భారతీయ అగ్ని క్షిపణి పితామహుడు ఆర్ఎన్ అగర్వాల్ కన్నుమూత

అగ్ని క్షిపణి పితామహుడు ఆర్‌ఎన్ అగర్వాల్(84) తుదిశ్వాస విడిచారు. అనారోగ్య సమస్యలతో గురువారం ఆయన హైదరాబాద్‌లో కన్నుమూశారు. 1990లో పద్మశ్రీ, 2000లో భారత అత్యున్నత పురస్కారమైన పద్మభూషన్ అవార్డు లభించింది.2004లో లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు. అగ్రి క్షిపణ కార్యక్రమానికి తొలి ప్రాజెక్ట్ డైరెక్టర్ అగర్వాలే.

అగర్వాల్ పూర్తి పేరు.. రామ్ నారాయన్ అగర్వాల్. సుదూర క్షిపణుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ప్రఖ్యాత ఏరోస్పేస్ శాస్త్రవేత్తగా పేరు గాంచారు. అందుకే ఆయన్ను అగ్ని క్షిపణి పితామహుడిగా పేరుగాంచారు.

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్‌తో అగర్వాల్‌కు దశాబ్దాల అనుబంధం ఉంది. 2005లో పదవీ విరమణ చేశారు. అగర్వాల్ మృతికి డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు. ఒక లెజెండ్‌ను కోల్పోయామని పేర్కొన్నారు. అగర్వాల్ జైపూర్‌లో జూలై 24, 1941న వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మరియు బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో అగర్వాల్ చదువుకున్నారు. 1983లో ప్రారంభమైన అగ్ని క్షిపణి కార్యక్రమానికి రెండు దశాబ్దాల పాటు న్యాయకత్వం వహించారు.

ఇది కూడా చదవండి: Vijayawada Airport: ఢిల్లీ- అమరావతి మధ్య ఇండిగో విమాన సర్వీసులు.. ఎప్పటి నుంచి అంటే..?