Leading News Portal in Telugu

Minister Farooq: మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..


  • వక్ఫ్ చట్ట సవరణపై మైనార్టీ మంత్రి ఫరూక్ సంచలన వ్యాఖ్యలు..

  • మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు..

  • వక్ఫ్ చట్ట సవరణపై భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతుంది..

  • మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు: ఏపీ మైనార్టీ మంత్రి ఫరూక్
Minister Farooq: మత సంస్థల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం తగదు..

వక్ఫ్ చట్ట సవరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీశాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేము చట్టం చేశాం.. పాటించండి అంటే కుదరదు.. మత సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం తగదు అని పేర్కొన్నారు. మత గౌరవాన్ని కాపాడే విధంగా వ్యవహారించాల్సింది పోయి సొంత నిర్ణయాలను మత సంస్థలపై రుద్దడం సరి కాదు అని ఆయన చెప్పుకొచ్చారు. విలువైన భూములను హస్తగతం చేసుకోవడం కోసం రైల్వే సంస్థ, డిఫెన్స్ ఆస్తుల్లా చేస్తామంటే కుదరదు.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి విలువైన భూములను జగన్ ఖాజేయ్యాలని చూశారు అని మంత్రి ఫరూక్ వెల్లడించారు.

ఇక, మత పెద్దలతో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటామంటే కుదరదు అని మంత్రి ఫరూక్ తెలిపారు. త్వరలో పార్లమెంట్ కమిటీ భేటీ అవుతుంది.. మార్పులు చేర్పులు చేశాక చూస్తాం.. వక్ఫ్ చట్ట సవరణపై భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.. దేశమంతా మనవైపే చూస్తోందని సీఎం చంద్రబాబుకు చెప్పాం.. అందుకే చట్ట సవరణ నిలుపుదల చేయించాం అని ఏపీ మైనార్టీశాఖ మంత్రి నస్యం మహమ్మద్ ఫరూక్ పేర్కొన్నారు.